ఫామ్‌హౌస్ కేసు : కేసీఆర్ కి కూడా సీబీఐ చిక్కులు !?

ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో సీఎం కేసీఆర్‌కూ చిక్కులు తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కేసును సీబీఐకి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో.. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు బయట పెట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించింది. సీఎం కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేయడంపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు విడుదల చేయడం కూడా సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు కేసీఆర్ కు ఆ సాక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చాయో.. సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పుడీ వ్యవహారం సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరిగిందని అనిపించడం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసును సీబీఐకి ఇవ్వడానికి 45 కారణాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తన తీర్పులో వెల్లడించారు. తన తీర్పులో 26 కేసుల్లో పాత జడ్దిమెంట్లను న్యాయమూర్తి ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ 455/2022 ను సీబీఐకి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చారు. జడ్జిమెంట్ కాపీలో కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రస్తావన చేర్చడం కూడా సంచలనం సృష్టిస్తోంది.

హైకోర్టు తీర్పు ఆధారంగా సీబీఐ.. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే కేసు నమోదు చేస్తుంది. సిట్ దర్యాప్తును పూర్తిగా రద్దు చేసినందున.. సీబీఐ ఈ కేసులో ఏం జరిగిందో మొదటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయనుంది. ఫిర్యాదుదారుడైన పైలట్ రోహిత్ రెడ్డి నుంచి మరోసారి సీబీఐ స్టేట్ మెంట్ నమోదు చేయనుంది. ఇలాగే ఇతర ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్ మెంట్ నమోదు చేసే అవకాశం ఉంది. సాక్ష్యాలను బహిర్గతం చేసినందున కేసీఆర్ నూ సీబీఐ ప్రశ్నించనుంది. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి వెళ్లకుండా.. తెలంగాణ సర్కార్.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close