ఎన్నికలకు ముందు టీటీడీ చైర్మన్ పోస్టు బీసీకిస్తారట !

వైసీపీకి ఎన్నికల భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అధికారం చేపట్టినప్పటి నుండి విచ్చలవిడిగా సొంత సామాజికవర్గానికి పదవుల పందేరం చేపట్టిన నేతలకు ఇప్పుడు .. సామాజిక న్యాయం చేయాలని..కనీసం చేసినట్లుగా అనిపించుకోవాలని తాపత్రయపడుతోంది. తిరుపతి జిల్లాలో ఏ పదవిలో చూసినా రెడ్లే ఉంటారు. టీటీడీ చైర్మన్ కూడా రెడ్డే. ఈవో కూడా రెడ్డే. ఇప్పుడు జగన్… ఇంత మంది రెడ్లు అక్కర్లేదు..ఒకర్ని తీసేసి బిసీకి ఇద్దాం అనుకుంటున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని పక్కన పెట్టేసి.. బీసీ నాయకుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామన్న విషయాన్ని మెల్లగా లీక్ చేస్తున్నారు.

వైవీ సుబ్బారెడ్డికి గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనందుకు .. ప్రతిఫలంగా అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత పొడిగించారు. కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని ఆయనను ఇప్పుడు పక్కన పెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఏ ఒక్క కీలక పదవి బీసీ వర్గాలకు ఇవ్వలేదంటున్నారు. ఇలాంటి సమయంలో కనీసం టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తే కాస్త ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటున్నారు. ఒక పదవి ఇచ్చి మొత్తం అధికారం కట్టబెట్టినట్లుగా ప్రచారం చేసుకోవడంలో వారికి వారే సాటి.

టీటీడీ బోర్డు పదవి కాలం ముగిసిన వెంటనే.. ఈ సారి మార్పు చేర్పులు చేసి.. కొత్త బోర్డును నియమించనున్నారు. ఇప్పటికే టీటీడీ బోర్డులో ఎంతో మంది నేరస్తులు ఉన్నారు. దీనిపై కోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం మారలేదు. ఇటీవలే జగన్ తన బయోపిక్ తీస్తున్న వ్యక్తికి టీటీడీ బోర్డు సభ్యత్వం ఇప్పించారు. వచ్చే సారి కూడా ఇలాంటి లాబీయిస్టులతోనే బోర్డు నిండిపోతే భక్తుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close