ఏపీ సర్కార్‌కు “ఆ” ఉద్యోగులు అంటరానివాళ్లు..!

ప్రభుత్వాలు మారినప్పుడు… ప్రభుత్వ పెద్దల అభిప్రాయం ప్రకారం.. అధికారుల టీం కూడా మారుతుంది. వారి మైండ్ సెట్‌కు తగ్గట్లుగా పని చేసే అధికారుల్ని తెచ్చుకుంటారు. అందుకే కొంత మంది ప్రాధాన్యం లభిస్తుంది. మరికొంత మంది లూప్ లైన్‌లోకి వెళ్లిపోతారు. ఇది సహజంగా జరిగేది. ఈ ప్రక్రియ మొత్తం.. సాధారణంగా.. ఐఏఎస్, ఐపీఎస్‌లలోనే జరుగుతుంది. కింది స్థాయి ఉద్యోగుల వరకూ వెళ్లిన సందర్భాలు లేవు. ఎందుకంటే.. వారికి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వం ఏం చెబితే. అది చేస్తారు. అందుకే వారి జోలికి ఏ ప్రభుత్వమూ వెళ్లదు. కక్ష సాధింపు లాంటి చర్యలు కూడా తీసుకోదు. కానీ ప్రస్తుత సర్కార్ మాత్రం భిన్నం. కొంత మందిని ప్రత్యేకంగా అంటరాని వాళ్లుగా చూస్తోంది. వారిని దూరం పెడుతోంది. ఎవరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చో.. ప్రణాళికలు వేసి అమలు చేస్తోంది. ఇదే ఏపీ సెక్రటేరియట్‌లో కలకలకానికి కారణం అవుతోంది.

ఏపీ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా బదిలీలు చేస్తోంది. డిప్యూటేషన్లను వేయడమో.. తీసేయడమో చేస్తోంది. ఇలా… ప్రతి విభాగంలోనూ జరుగుతోంది. సెర్ఫ్ లో… పదకొండు మంది అధికారులను… ఉన్న పళంగా.. తప్పించేసి.. వారిని… ఇతర విభాగాలకు పంపారు. వారు అక్కడి నుంచే డిప్యూటేషన్‌పై సెర్ఫ్‌కి వచ్చారు. ఇలా.. గత నెల రోజుల కాలంలో… ప్రతీ రోజూ.. మౌఖికంగానో.. రికార్డు పరంగానే.. ఆదేశాలు వస్తూనే ఉన్నాయి. ఉద్యోగులు సర్దుకుంటూనే ఉన్నారు. కానీ.. అందరిలోనూ.. కామన్‌గా ఉన్న విషయం ఏమిటంటే… వారంతా.. ” ఓ ” సామాజికవర్గానికి చెందినవారు. ఆ సామాజికవర్గానికి చెందిన వారైతే.. చాలు.. గోల్ఫ్ బాల్‌ని కొడితే.. ఎక్కడ పడుతుందో తెలియదన్నట్లుగా ఆ అధికారిని బదిలీ చేస్తున్నారు. వారిపై ఆవినీతి ఆరోపణలు ఉన్నాయా..? చురుకైన అధికారి కాదా..? లాంటివన్నీ… అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు.

ఆ సామాజికవర్గం వారిని తీసివేయడమే కాదు.. నామినేటెడ్ పోస్టుల్లోనూ.. దిగువస్థాయి అధికారులను… ఇతర శాఖలకు తీసుకొచ్చి.. ప్రాధాన్యత కల్పించడంలోనూ..ఈ ప్రభుత్వం హైపర్ యాక్టివ్ గా ఉంది. ఇక్కడా… ఓ సామాజికవర్గానికే ప్రాధాన్యం ఉంది. ఢిల్లీలో… ఏపీకి సంబంధం లేని క్యాడర్ లో ఉద్యోగం చేసుకునే ఉద్యోగి ధర్మారెడ్డిని తీసుకొచ్చి.. ఐఏఎస్‌లకు మాత్రమే ఇచ్చే టీటీడీ జేఈవో పోస్టు ఇచ్చారు.. అది ఓపెనింగ్ షాట్.. అక్కడ్నుంచి… చిన్న చిన్న ఉద్యోగులు కూడా… సామాజికవర్గ బలంతో… గొప్ప అధికారం చెలాయించే స్థితికి చేరుకున్నారు. కొంత మందిపై.. కేవలం సామాజికవర్గం కారణంగా కక్ష సాధించడం… అలాగే ప్రాధాన్యత కల్పించడం… తొలి సారి జరుగుతోందని ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు… అంటరానితనం ఉండేదని.. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వంలో బయటపడుతోందన్న.. అసహనం చాలా మందిలో కనిపిస్తోందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close