ఇక ఫైబర్ నెట్ అవినీతి కథలు !

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతోంది. ఇంత కాలం ఏం చేశారో కానీ ఇప్పుడు ఫైబర్‌నెట్‌లో అక్రమాల పేరుతో సీఐడీ కేసులు నమోదు చేయించి విచారణ ప్రారంభించారు. మొత్తం 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాటిని కొన్ని మీడియా వర్గాలకు లీ‌క్ చేశారు. ఇక మీడియా వర్గాలు తమ శక్తికి మించి ఆ స్కాంను రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఒకరు రూ. రెండు వేల కోట్ల దాకా వెళ్లిపోయారు. చాలా మంది రూ. 321 కోట్ల దగ్గర ఉండిపోయారు. ఎందుకంటే ఆ ఫైబర్ నెట్‌లో పనులు జరిగింది ఆ రూ. 321కోట్ల వరకే. అందుకే అది మొత్తం అవినీతి అని చెబితే కాస్త నమ్మబుల్ గా ఉంటుందేమో అనిఅక్కడే ఆగిపోయారు. కానీ కొంత మంది అత్యుత్సాహ ప్రో వైసీపీ మీడియా మాత్రం రూ. రెండువేల కోట్ల వరకూ వెళ్లిపోయింది.

నిజానికి ఫైబర్ నెట్‌లో స్కామంటూ రెండేళ్లుగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్రంమాత్రం అందులో ఎలాంటి స్కామ్ లేదని ప్రకటించింది. పైగా తక్కువ ఖర్చుతో దాన్ని నిర్వహణలోకి తీసుకు వచ్చినందుకు అభినందించింది కూడా. అయితే ఏపీ ప్రభు్తవానికి మాత్రం అందులో స్కాం కనిపించింది. చివరికి రాజధాని కేసుల్లో దింపినట్లుగానే సీఐడీని రంగంలోకి దింపి.. పందొమ్మిది మందిపై కేసు పెట్టింది. అందులో హరిప్రసాద్ ఏ వన్ గా ఉన్నారు. కొంత మంది అధికారుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి ఆరోపణలు చేస్తే చాలు… కోర్టుల్లో నిరూపించకపోయినా పర్వాలేదు.. మీడియా, సోషల్ మీడియా బలంతో ప్రచారం చేస్తే అదే రాజకీయ లాభం అనుకుంటున్నారు. రోజూ ఏదో ఓ పేపర్ బయట పెట్టి..ఇదిగో స్కాం అంటున్నారు. అందులో ఏ స్కాం ఉందో లేదో తెలియక జుట్టు పీక్కుని.. ఇంటర్నెట్‌లో అన్ని పత్రాలు వెదుక్కుని టీడీపీ నేతలు తూచ్ అని.. వివరాలు బయట పెట్టి వివరణ ఇవ్వాల్సి వస్తోంది. కొద్ది రోజుల కిందట వైసీపీ మీడియా లోకేష్ సంతకం చేసిన ఓ పత్రాన్ని చూపించి.. ఫైబర్ నెట్‌ స్కాంకు ఇదే పెద్ద సాక్ష్యం అని ప్రచారం చేశారు. చివరికి ఆ లేఖ ఓ అధికారిక కార్యక్రమానికి అనుమతి కోసం మంత్రి హోదాలో పెట్టిన సంతకంగా తేల్చారు.

ఢిల్లీకి సీఎం జగన్ ఎప్పుడు వెళ్లినా ఫైబర్ నెట్‌పై దర్యాప్తు చేయించాలని కోరేవారు. ఎంపీలదీ అదే పని. కానీ కేంద్రం మాత్రం చేయించలేదు. అయితే వారు చేయించకపోయినా ఇక్కడ సీఐడీ ద్వారా చేయించి.. మీడియాలో ప్రచారం ద్వారా అవినీతి ముద్ర వేస్తే స్వకార్యం తీరిపోతుందన్న వ్యూహం అమలు చేయడం ప్రారంభిచేశారని గతంలో నమోదైన అవినీతి కేసులు.. ప్రచార ఆర్భాటాన్ని బట్టి గుర్తు చేసుకోవచ్చన్న అభిప్రాయం సహజంగానే వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close