అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయనపై పెట్టింది పెట్టీ కేసులే కావడంతో కోర్టు కస్టడీకి ఇవ్వకుండా బెయిల్ ఇచ్చింది. పోలీసులు తీవ్రమైన సెక్షన్లు పెట్టలేదు. మొదటి సారి అరెస్టు చేసినప్పుడే ఆయనకు బెయిల్ వచ్చేది కానీ.. ప్రజలు ఆగ్రహంగా ఉన్నందున ఆయన జైల్లో ఉండటమే మంచిదని ప్రభుత్వ న్యాయవాది వాదనలకు పొన్నవోలు అడ్డగోలు వాదన వినిపించడంతో జైలుకు పోవాల్సి వచ్చింది.
ఆ కేసులో సోమవారం బెయిల్ వచ్చింది. కానీ గతంలో పోలీసులపై రుబాబు చేసిన కేసులో పీటీ వారెంట్ దాఖలు చేయడంతో మళ్లీ జైలుకెళ్లారు. ఆ కేసులోనూ బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆయన విడుదల కానున్నారు. ఆయనపై చంద్రబాబును దూషించినందుకు 36 కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు క్వాష్ చేయాలని రాంబాబు కోర్టుకెల్లారు. కేసుల్ని క్వాష్ చేయలేదు కానీ.. ఆయనకు నోటీసులు జారీ చేయాలని కోర్టు సూచించింది. దాంతో ఆ కేసుల్లోనూ అరెస్టు చేసే అవకాశాలు లేనట్లే.
అయితే రాంబాబుకు ఇప్పుడు బెయిల్ వచ్చింది కానీ.. ఆయన బయటకు రావడం ఇబ్బందికరమే. ఆయనను గుంటూరు కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకు వస్తున్నప్పుడు పోలీసులు చుట్టూ నిలబడి సేఫ్ గార్డుల్ని పెట్టుకుని రక్షిస్తున్నారు. ఇప్పుడు ఇక అలాంటి సెక్యూరిటీ కల్పించరు. చంద్రబాబుపై ఆయన మాట్లాడిన ఘోరమైన మాటలకు ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నందున ఆయన సెక్యూరిటీ సమస్యగా మారే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
