సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పేరును చేర్చి దారుణమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని .. తన తో పాటు తన కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని కేటీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. క్రిమినల్ కేసు నమోదు చేసే అర్హత ఉందని స్పష్టం చేస్తూ.. కేసులు నమోదు చేయాలని 21వ తేదీ లోపు కొండా సురేఖకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
2024 అక్టోబర్ 2న, గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద జ కొండా సురేఖ కేటీఆర్‌పై , నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశారన్నారు. నాగచైతన్యతో సమంత అందుకే విడాకులు తీసుకుందన్నారు. అలాగే చాలా మంది హీరోయిన్లనూ కేటీఆర్ వేధించారని ఆరోపించారు. ఇవన్నీ సోషల్ మీడియాలో కొంత మంది రాజకీయ పార్టీల కార్యకర్తలు ఏ మాత్రం ఆధారాలు లేకుండా రేపే పుకార్లు. వాటిని తీసుకొచ్చి కొండా సురేఖ బహిరంగంగా చెప్పారు.
నాగార్జున కుటుంబం కూడా కొండా సురేఖపై వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది. నాగార్జునతో పాటు పలువురు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. ఈ పిటిషన్ లోనూ ఆమెపై మరో కేసు నమోదు చేసే అవకాశాలు ఉంటాయని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజకీయంగా సైతం దుమారం రేపిన ఈ వ్యాఖ్యల తర్వాత.. కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కానీ వివాదం సద్దుమణగలేదు.