ఇప్పుడు ‘అఖండ 2’ వాయిదా గురించి తప్పా మీడియాలో మరో న్యూస్ లేకుండా పోయింది. అటు సోషల్ మీడియా ఇటు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్..అఖండ వాయిదా కథనాలే ప్రచురిస్తున్నాయి. తోచిననట్లు ఊహాగానాలు కూడా ప్రసారం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిర్మాత సురేష్ బాబు అసహనం వ్యక్తం చేశారు.
సినిమాలకి ఆర్థికపరమైన ఇబ్బందులు వుంటాయని , అవి బయటకు వెల్లడించాల్సిన అవసరలేదని, ఆర్థిక వ్యవహారాల గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. ‘ప్రతిఒక్కరూ ‘‘అఖండ 2’ రిలీజ్ కాకపోవడానికి ఏవేవో కారణాలు చెబుతున్నారు. అన్ని కోట్లు చెల్లించాలట.. ఏవేవో రాస్తున్నారు. అవి అన్నీ అనవసరపు ప్రస్తావనలు’ అన్నారు సురేష్ బాబు. ”నేను కూడా ఆ ఇష్యూని క్లియర్ చేయడానికి వెళ్లాను. ఆడియన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై సినిమా విడుదలవుతుంది’ అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ రోజు (డిసెంబర్5) రిలీజ్ కావాల్సిన ‘అఖండ 2’ వాయిదా పడిన విషయం తెలిసిందే. మొదట ప్రిమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు 14రీల్స్ నిర్మాతలు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచుస్తున్నారు.