తిరుపతిలో హథీరాంజీ మఠానికి చెందిన భవనం శిథిలావస్థకు చేరింది. అది కూలిపోయే స్థితికి చేరిందని మద్రాస్ ఐఐటీ కూడా రిపోర్టు ఇచ్చింది. దాంతో జగన్ హయాంలోనే ఏపీ ప్రభుత్వం కూలక ముందే కూల్చేయాలని నిర్ణయించింది. అప్పట్లో వివాదాల కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తమకేమీ తెలియదన్నట్లుగా వైసీపీతో పాటు ఇతర మేధావులు కూడా బయలుదేరారు. చివరికి కల్వకుంట్ల కవిత అమెరికాలో ఉండి కూడా ఓ ట్వీట్ పెట్టారు. ఆ మఠాన్ని కూల్చవద్దని.. అది బంజారాల సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని తన రాజకీయం తాను చేసుకున్నారు.
మఠాలను కూర్చడానికి అధికారులకు ఏమైనా సరదా ఉంటుందా.. అది పూర్తి స్థాయిలో శిథిలమైపోయి.. కాపాడుకోలేని స్థికి చేరినందునే మఠాన్ని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. కూల్చివేయాలన్న నిర్ణయం జరిగి చాలా కాలం అియనా ఇప్పుడు దాని చుట్టూ వివాదం ప్రారంభం కావడంతో ఆలోచించే అవకాశం లేదు. ఈ వర్షాకాలంలో ఎప్పుడైనా ఆ మఠం కూలిపోయే ఇప్పుడు అడ్డం పడిన వాళ్లంతా మళ్లీ.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. శిథిలభవనాలను ఎందుకు తొలగించలేదని నోరేసుకుని వస్తారు. అదే రాజకీయం అని సరిపెట్టుకోవాలి.
ఇప్పుడు ప్రభుత్వం ఆ హాథీరాంజీ మఠం భవనంపై కూలిపోకుండా పటిష్టం చేసే మార్గాలేమైనా ఉన్నాయో ఆలోచిచాల్సి ఉంది. లేకపోతే రాజకీయం చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. హథీరాంజీ మ తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు . 15శతాబ్దంలోనే మఠాన్ని నిర్మించారు. మఠం TTD ఆస్తుల్లో భాగం. TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. TTD కొత్త అధికారులు మఠం పునర్నిర్మాణం లేదా రక్షణపై చర్చిస్తున్నారు. నిపుణులతో పరిశీలనలు చేయించాలని నిర్ణయించారు.