ఎన్నిక‌ల క‌మిష‌న్‌కే లంచ‌మా: దిన‌క‌ర‌న్‌పై కేసు

ఎన్నిక‌ల్లో గెలుపున‌కు అభ్య‌ర్థి కంటే గుర్తు ఎంతో ముఖ్యం. గుర్తు చూసి ఓటేసేసే మ‌హానుభావులు ఎంతోమందున్నారు. స‌రిగ్గా ఇదే త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ వ‌ర్గానికి చిక్కులు తెచ్చిపెట్టింది. అన్నాడీఎంకేలోని శ‌శిక‌ళ‌, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాలు ఎన్నిక‌ల చిహ్నం కోసం పిల్లుల్లా పోట్లాట‌కు దిగ‌డంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆ గుర్తును ఫ్రీజ్ చేసింది. ఇద్ద‌రికీ చెరో గుర్తునూ కేటాయించింది. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం శ‌శిక‌ళ వ‌ర్గం ఏకంగా రెండుల‌క్ష‌ల 70వేల చిల్ల‌ర ఓట్ల‌ను కొన‌డానికి 90 కోట్ల‌ను విత‌ర‌ణ చేసేయ‌డానికి ఏకంగా ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిసామి నేతృత్వంలోనే వ్యూహ ర‌చ‌న సాగింది.

చివ‌రి నిముషంలో ఐటీ దాడుల‌లో ఈ వ్యూహం వెల్ల‌డై ఎన్నిక వాయిదా ప‌డింది. ఓ ప‌క్క‌న ఓట్ల‌ను కొంటూనే త‌మ ఎన్నిక‌ల చిహ్నం రెండాకుల‌ను తిరిగిపొంద‌డానికి ఎన్నిక‌ల క‌మిష‌న్‌కే లంచం ఇవ్వ‌జూప‌డానికి సాహ‌సించింది. ఇందులో భాగంగా చంద్ర‌శేఖ‌ర్ అనే మ‌ధ్య‌వ‌ర్తికి కోటి 30 ల‌క్ష‌లు ఇచ్చింది. ఈ అంశంపై ఫిర్యాదు అంద‌డంతో ఢిల్లీ క్రైమ్ పోలీసులు అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్, ఆర్కే న‌గ‌ర్ అభ్య‌ర్థి అయిన టిటివి దిన‌క‌ర‌న్‌పై కేసు న‌మోదు చేశారు. చంద్ర‌శేఖ‌ర్ ఇచ్చిన వివ‌రాల‌తో ఈ చ‌ర్య తీసుకున్నారు. ఇది మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డంలాంటిదే. త‌మిళ‌నాట బీజేపీ ఆడుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఇప్పుడు పావు ఎవ‌రో తేట‌తెల్ల‌మై పోయింది. త‌మిళ‌నాట బీజేపీ పట్టు చిక్కించుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఒక రాష్ట్ర ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొన‌డానికి ఆడే రాజ‌కీయ క్రీడ ఇలాగేనా. ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడాలి. వారి మ‌న్న‌న‌లు పొందాలి. శ‌కుని పాచిక‌ల మాదిరిగా వ్యూహాలు ర‌చిస్తే అవి బెడిసి కొట్ట‌డం ఖాయం.

Subrahmanyam vs kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోంమంత్రి అనిత … వనితలా కాదు !

ఏపీ హోంత్రులుగా దళిత మహిళలే ఉంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఇద్దరు దళిత హోంమంత్రులు ఉన్నారు. ఒకరు మేకతోటి సుచరిత, మరొకరు వనిత. అయితే తాము హోంమంత్రులమన్న సంగతి వీరిద్దరికి కూడా...

జగన్ అహానికి ప్రజల పరిహారం పోలవరం !

పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ జీవనాడి. కేంద్రం వంద శాతం నిధులతో నిర్మించుకోమని జాతీయ హోదా ఇస్తే కళ్లు మూసుకుని నిర్మాణాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును జగన్ రెడ్డి తన అహానికి...

ఆ 30 ఫీట్ ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే !

తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో...

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close