ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. ఆ సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని.. ఎవరో ఫిర్యాదు చేస్తే.. ఏసీబీ కేసులు నమోదు చేసింది. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. ఏమి విచారణ చేశారో… తెలియదు కానీ… ఉదయమే.. ఆయన ఇంటిని వంద మందిని పోలీసులు చుట్టుముట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర .. తన స్వగ్రామం చింతలపూడిలో ఉంటారు. ఆ గ్రామంలోకి వందల మంది పోలీసులు ఉదయమే చుట్టుముట్టి ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కూడా చెప్పకుండా … కుటుంబసభ్యులకు కూడా వివరంగా చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లే సమయంలో నరేంద్ర సతీమణినకి నోటీసులు ఇచ్చారు. నాన్ బెయిలబుల్ కే్సులు నమోదయిందని.. అరెస్ట్ చేస్తున్నామని అందులో ఉంది.

ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఓ ప్రాసెస్ ఉంటుంది. నోటీసులు జారీ చేస్తారు. విచారణ చేస్తారు. విచారణకు సహకరించకపోతేనో.. అరెస్ట్ చేయక తప్పదనుకుంటేనో చేస్తారు. కానీ ఏపీలో పోలీసులు… టీడీపీ నేతల విషయంలో అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. తెల్లవారు జామున వచ్చిన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. నిన్నగాక మొన్న దేవినేని ఉమపై.. జగన్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించినందుకే సీఐడీ కేసు పెట్టి.. కర్నూలు రావాలని నోటీసులు జారీ చేసింది. ఆయన కోర్టుకెళ్లి అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అలాంటి న్యాయపోరాటం ధూళిపాళ్ల నరేంద్ర ఎక్కడ చేస్తారో.. ఆయన్ను తప్పకుండా జైలుకు పంపాలని నిర్ణయించుకున్నారేమో కానీ ఉదయాన్నే విరుచుకుపడ్డారు. నిజానికి సంగం డెరీలో అవకతవకలపై కేసులు నమోదయ్యాయని.. ఎవరికీ తెలియదు. కానీ కేసులు నమోదు చేసి.. ఆధారాలు ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి పని పూర్తి చేశారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్న నేతలందరిపైనా అరెస్ట్ కత్తి వేలాడుతోంది. ఏదో ఓ కేసు పెట్టి కొన్నాళ్లయినా జైల్లో పెట్టాలన్న లక్షంతో..ప్రభుత్వ పెద్దలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నేతలు కూడా.. మానసికంగా అరెస్టులకు సిద్ధమయ్యారు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వంపై యాక్టివ్‌గా పోరాటం చేస్తున్నవారు టార్గెట్ అవుతున్నారు. వారికి న్యాయపోరాటం చేసే చాన్స్ కూడా ఇవ్వకుండా… అప్పటికప్పుడు అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల్లో కనీస ప్రక్రియ కూడాపాటించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close