ఒక్క పార్టీ, భిన్న స్వరాలు – ఆంధ్ర బీజేపీ ఎప్పటికైనా బాగుపడేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలని ఎప్పటి నుండో బీజేపీ తాపత్రయం.‌ కానీ ఆ పార్టీకి క్రౌడ్ పుల్లర్ అయిన ఒక నాయకుడు లేకపోవడం, అవసరమైన సందర్భాల్లో ఉన్న ఆ కొద్ది మంది నాయకులు కూడా చేరి ఒక స్వరం వినిపించకపోవడం, టీవీ చానల్స్ లో, సోషల్ మీడియాలో తప్ప ఈ పార్టీ నాయకులు జనంలో కనిపించరు అన్న అభిప్రాయం ఉండటం వంటి కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎప్పటి నుండో ఎదగలేక పోతుంది.‌ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం సమస్య మీద చేపట్టిన పోరాటం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ లోని అయోమయం, భిన్న స్వరాలు మరోసారి బయటపడ్డాయి.

అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చి ఇసుక సమస్య మీద పోరాటం చేయాలనుకున్న పవన్:

పవన్ కళ్యాణ్ అధికారంలోకి పార్టీని నడిపించ లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాటంలో మాత్రం ఎప్పుడు వెనకబడలేదు. గత ప్రభుత్వ హయాంలో ఉద్దానం సమస్య, శెట్టి పల్లి భూముల సమస్య, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్య వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం ఉండదు. ఆఖరికి తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీలు కూడా ఈ సమస్య మీద మొదట మాట్లాడింది పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని అంతర్గతంగా అంగీకరిస్తాయి.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరత అన్నది భవన నిర్మాణ కార్మికుల జీవనం పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొంత మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఆత్మహత్యలని తేలికగా తీసుకోవడం, విజయసాయి రెడ్డి లాంటి వారు ఆత్మహత్యలను చిన్న సమస్య అని మాట్లాడడం, పుండు మీద కారం చల్లినట్లు అయింది. దీంతో అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చి ఈ సమస్యపై పోరాడడానికి, లాంగ్ మార్చ్ చేయడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అన్ని పార్టీలతో పాటు బీజేపీని కూడా ఈ సమస్యపై గళం వినిపించడానికి లాంగ్ మార్చ్ లో పాల్గొనాల్సిందిగా కోరారు.

బీజేపీ పాల్గొనబోదని ప్రకటించిన విష్ణువర్ధన్ రెడ్డి:

పవన్ కళ్యాణ్ కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానిస్తే దానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ, “ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గారు.. పవన్ సభలో పాల్గోనాల్సిన అవసరం బీజేపీ కి లేదు. ఇసుక సమస్య పై మొదటి నుండి పోరాడుతుంది బీజేపీ. ముఖ్యమంత్రి కి లేఖ రాసింది మొదట బీజేపీనే. ఇసుక సమస్య పై గవర్నర్ ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది బీజేపీ. జనసేన ఆందోళన వెనక చంద్రబాబు తన అనైతిక రాజకీయం ముసుగు స్పస్టంగా కనపడుతుంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారనే విషయం మరిచిపోకూడదు. ఇసుక సమస్య పై రాష్ట్రంలో బీజేపీ గతంలో పోరాడింది,రేపు పోరాడుతుంది. అందుకే ఈ సమస్యకు సంఘీభావం బీజేపీ తెలియజేసింది.” అని రాసుకొచ్చారు.

పవన్ నిజాయితీపరుడు అన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి సునీల్ దేవధర్:

ఇక్కడ స్థానికంగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నాడు అంటూ విమర్శిస్తూ ఉంటే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్, కేంద్రంలో పలుకుబడి కలిగిన సునీల్ దేవధర్ కు మాత్రం పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు అంటూ కితాబు ఇస్తున్నాడు.

సోము వీర్రాజు- హరిబాబు మొదలు, ఎప్పుడూ ఆంధ్ర బీజేపీలో భిన్నమైన స్వరాలే:

అప్పట్లో కంభంపాటి హరిబాబు వెంకయ్యనాయుడు గ్రూపులో ఉంటే, సోము వీర్రాజు రామ్ మాధవ్ గ్రూపులో ఉండేవాడు. ఈయన ఎడ్డెం అంటే ఆయన తెడ్డెం అనేవాడు. అసలు ఏది బీజేపీ వైఖరి అన్న విషయంపై ప్రజలలో గందరగోళం ఉండేది. ఇప్పుడు సుజనాచౌదరి ఒకటి చెబితే, కన్నా లక్ష్మీనారాయణ రెండవది చెబితే, విష్ణువర్ధన్ రెడ్డి ఆ రెండూ కాకుండా మూడవది చెబుతున్నాడు.

సామాజికవర్గాల సమీకరణల ప్రకారం కూడా, సుజనా చౌదరి చేసే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి మంచివి గా కనిపిస్తే, విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వైయస్ఆర్సీపీ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఇసుక సమస్య మీద పవన్ కళ్యాణ్ తో కలవం అని ట్వీట్ చేసిన తర్వాత, నెటిజన్లు కూడా ఆయనని పక్కా సాక్షి అభిమానిగా భావిస్తున్నారు. పైగా సాక్షి మీడియా ట్వీట్ చేసిన అంశాలను ఆయన రీ-ట్వీట్ చేయడం చూస్తుంటే విష్ణువర్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగడం కంటే కూడా అధికార పార్టీకి వత్తాసు పలకడమే ముఖ్యమా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులలో అధికారపక్షం మీద పోరాడాలా వద్దా అన్న అంశం పై కూడా ఏకాభిప్రాయం లేనట్లుగా కనిపిస్తోంది. రెడ్డి గారి లాంటి నాయకులు జగన్ కు ఇబ్బంది కలగకుండా కేవలం ట్వీట్ లు చేస్తూ, పోరాటం చేస్తున్నట్లుగా కలర్ ఇస్తే సరిపోతుంది అని భావిస్తుంటే, మరికొందరు బీజేపీ నాయకులు మాత్రం వైకాపా మీద గట్టిగా పోరాడాలని భావిస్తున్నారు.

ఇలాంటి గ్రూపులు, గందరగోళం నుండి బయట పడనంతకాలం ఆంధ్రాలో బీజేపీ కి నోటా కంటి ఎక్కువ ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close