దిల్‌రాజు మాట విన‌ని ద‌ర్శ‌కుడు

దిల్‌రాజు… ఓ అగ్ర నిర్మాత‌. ప‌రిశ్ర‌మ మొత్తానికి ఆయ‌న మాటంటే గురి. ఓ ర‌కంగా ప‌రిశ్ర‌మ‌ని శాశించే వ్య‌క్తుల్లో దిల్ రాజు పేరు మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. అగ్ర ద‌ర్శ‌కులు సైతం.. ఆయ‌న మాట‌కి ‘నో’ చెప్పే ఛాన్స్ లేదు. అయితే.. ఓ కొత్త ద‌ర్శ‌కుడు మాత్రం దిల్ రాజు మాట‌కి నో చెప్పాడు. ఆయ‌న చెప్పిన స‌ల‌హాలూ సూచ‌న‌లు పెడ చెవిన పెట్టాడు. తాను అనుకున్న‌దే తీశాడు. ఈ విష‌యాన్ని దిల్ రాజు సైతం మీడియా ముందు ప్ర‌స్తావించ‌డం విశేషం.

దిల్ రాజు నిర్మాత‌గా రూపుదిద్దుకున్న సినిమా ‘జానూ’. త‌మిళ 96కి ఇది రీమేక్‌. అక్క‌డ ఆ సినిమాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్ కుమార్ కే తెలుగు రీమేక్ బాధ్య‌త‌లు అప్పగించారు. అయితే త‌మిళ సినిమాకీ తెలుగు సినిమాకీ కొన్ని మార్పులు, చేర్పులూ ఉండాల‌ని దిల్ రాజు భావించాడు. ఓ పేప‌ర్ పై అవ‌న్నీ రాసి, ద‌ర్శ‌కుడి ముందు పెట్టాడు కూడా. కానీ… ద‌ర్శ‌కుడు వాటిని ప‌ట్టించుకోలేదు. తాను ఏదైతే అనుకున్నాడో అదే తీశాడు. ఈ విష‌యాన్ని దిల్ రాజు ఒప్పుకున్నారు. ”నేను కొన్ని మార్పులు చెప్పాను. అయితే అవేమీ ప్రేమ్ ప‌ట్టించుకోలేదు. తన మ‌న‌సులో ఈ క‌థ‌ని ఎలా తీయాల‌నుకున్నాడో అలానే తీశాడు. కేవ‌లం తెలుగు నేటివిటీకి సంబంధించిన మార్పులే జ‌రిగాయి. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి పాత్ర చాలా సైలెంట్‌గా ఉంటుంది. తక్కువ మాట్లాడ‌తాడు. కానీ.. శ‌ర్వానంద్ పాత్ర దాంతో పోలిస్తే కాస్త హుషారుగా ఉంటుంది. నేను చెప్పిన మార్పులు చేయ‌లేద‌ని ఎలాంటి కంప్లైంట్ లేదు. చివ‌రికి ప్రేమ్ నాకు న‌చ్చిన సినిమానే తీశాడ‌”న్నారు. అయితే ఈ ప్రేమ్ ఎవ‌రో కాదు.. ఇది వ‌ర‌కు తొలి అవ‌కాశం దిల్ రాజు బ్యాన‌ర్‌లోనే వ‌చ్చింది. ‘ఆర్య‌’ సినిమాకి ప్రేమ్ కుమార్ అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌ని చేశాడ‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close