అమీర్ తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తీవ్రంగా నిరాశపరిచింది. ‘ఫారెస్ట్ గంప్‌’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా చేదు ఫలితం చవి చూసింది. అమీర్ సినిమాలు విమర్శకుల ప్రసంశలు పొందుతాయి. అయితే ఈ సినిమాపై విమర్శకులు కూడా పెదవి విరిచారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది. దీంతో చిత్ర దర్శకుడు అద్వైత్‌ చందన్‌పై ఆమిర్‌ ఆగ్రహంగా ఉన్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి.

అయితే దీనిపై తాజాగా దర్శకుడు అద్వైత్‌ క్లారిటీ ఇచ్చారు. ఆమిర్‌తో దిగిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.‘‘ఆమిర్‌కు నాకు మధ్య విభేదాలున్నాయని అనుకుంటున్న వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. జీనీ – అలాద్దీన్‌, బాలు – మోగ్లీ, అమర్ – ప్రేమ్‌ లాంటి అనుబంధం మాది ’’ అని రాసుకొచ్చాడు. మొత్తానికి కొన్నాళ్ళుగా జరుగుతున్న ప్రచారానికి తన పోస్ట్ తో పుల్ స్టాప్ పెట్టాడు అద్వైత్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close