ద‌ర్శ‌కురాలు బి. జ‌య క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు బి.జ‌య కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 54 సంవ‌త్స‌రాలు. చంటిగాడు సినిమాతో ద‌ర్శ‌కత్వం వైపు అడుగులు వేశారు జ‌య‌. `ప్రేమికులు`, `గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు`, `స‌వాల్‌` చిత్రాల్ని తెర‌కెక్కించారు. ఆమె ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ల‌వ్‌లీ` మంచి విజ‌యాన్ని అందుకుంది. `వైశాఖం` ఆమె చివ‌రి చిత్రం. ఎంఏ ప‌ట్టాపుచ్చుకున్న జ‌య‌.. పాత్రికేయ‌వృత్తిపై ప్రేమ‌తో జ‌ర్న‌లిస్టుగా మారారు. జ్యోతిచిత్ర‌, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిల‌కు ప‌నిచేశారు. భ‌ర్త‌, సీనియ‌ర్ సినీ పాత్రికేయుడు బిఏ రాజుతో క‌ల‌సి `సూప‌ర్ హిట్‌` మ్యాగ‌జైన్‌ని స్థాపించారు. ఆ త‌ర‌వాతే ద‌ర్శ‌క‌త్వం వైపు అడ‌గులు వేశారు. బిఏ రాజుతో క‌ల‌సి ప‌లు చిత్రాల్ని రూపొందించార‌య‌న‌. `వైశాఖం` సొంత బ్యాన‌ర్‌లో రూపొందిన చిత్ర‌మే. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ కొద్దిసేప‌టి క్రితం హైద‌రాబాద్‌లోని త‌న స్వ‌గృహంలో గుండెపోటితో మ‌ర‌ణించారు. శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని పంజ‌గుట్ట స్మ‌శాన వాటిక‌లో జ‌య అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close