మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. ‘గబ్బర్ సింగ్’ తన జీవితంలో ఓ మైలు రాయి. స్వతహాగా మంచి రైటర్ కావడం తనకు మరింతగా కలిసొచ్చింది. హీరోల్ని ఎలివేట్ చేయడానికి సింగిల్ లైనర్లని బాగా వాడుకొంటాడు. పెద్ద హీరోలతో వర్క్ చేసే క్యాపబులిటీ తనకు పుష్కలంగా ఉంది. ఇప్పటికే పవన్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో పని చేశాడు. చిరంజీవితో ఓ సినిమా చేయాలన్నది తన కల. చిరుతో ఆల్రెడీ ఓ యాడ్ ఫిల్మ్ కూడా చేశాడు. స్ట్రయిట్ సినిమా చేయాలని ఆశ పడుతున్నాడు. అది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో తీరుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ‘ఉస్తాద్’ ఈనెల 19న విడుదల అవుతోంది. ఈ సినిమా హిట్టయితే.. చిరు నుంచి పిలుపు వస్తుందన్నది తన భరోసా.
”చిరుతో పని చేయాలన్నది నా ఆశ. తప్పకుండా మా కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి ఓ మాస్ సినిమా చేస్తా..“ అని నమ్మకంగా చెబుతున్నాడు హరీష్. త్వరలో బాలకృష్ఱతో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు హరీష్. ఇటీవల బాలయ్యతో హరీష్ సంప్రదింపులు కూడా జరిపాడట. ఆయన కూడా ‘ఉస్తాద్’ రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఉస్తాద్ గనుక హిట్టయితే.. అటు బాలయ్య నుంచి ఇటు చిరు నుంచి పిలుపు రావడం ఖాయం. మరి ఏం జరుగుతుందన్నది ఇంకొన్ని రోజులు ఆగితే సరిపోతుంది.
