తెలంగాణలో టీడీపీ టిక్కెట్లకు అంత డిమాండ్ ఉందా..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇలా అసెంబ్లీని రద్దు చేసి.. అలా అభ్యర్థుల్ని ప్రకటించారు. దాంతో కేసీఆర్ చాలా వరకూ.. టిక్కెట్ల టెన్షన్ వదిలించుకున్నారు. కసరత్తు పేరుతో… పేర్లు ముందేసుకుని కూర్చుంటే.. అన్ని వైపుల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఇన్నీ ఇన్నీ కావు. ఒక్క దెబ్బతో … స్వీట్ ఇచ్చినవాళ్లకు స్వీట్ ఇచ్చారు.. షాక్ ఇచ్చిన వాళ్లకు షాక్ ఇచ్చారు. కోలుకున్న వాళ్లు తోక జాడిస్తున్నారు. వారి విషయంలో కేసీఆర్ శైలి…ఒక్కటే.. ఉంటే ఉండండి.. పోతే పొండి అని. ఇలాంటి వారంతా.. సైలెంట్‌గా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఆ పార్టీలు కాంగ్రెస్ మాత్రమే కాదు… టీజేఎస్ నుంచి టీడీపీ వరకూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని.. చాలా పరిమితమైన స్థానాలకే పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న తెలంగాణ సీనియర్లకు మాత్రమే అకామిడేట్ చేస్తారని… చెబుతున్నారు.

అయితే.. పొత్తుల గురించి ఆలోచించకుండా.. పార్టీలో లేని చాలా మంది తెలంగాణ నేతలు.. అమరావతికి క్యూ కడుతున్నారట. పలువురు.. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. టీడీపీతో సంబంధం లేదని.. తెలంగాణ నేతల నుంచి చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోసం వస్తున్న విజ్ఞప్తులు చూసి.. టీడీపీ నేతలకే ఆశ్చర్యం వేస్తోంది. ప్రత్యేకంగా అమరావతి రావడం ఎందుకు.. తాను శనివారం హైదరాబాద్ వస్తానని.. అక్కడే కలుద్దామని చంద్రబాబు చాలా మందికి సమాచారం ఇచ్చారు. కానీ.. పాత పరిచయాలు ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ మాత్రం ఉన్న పళంగా కలుస్తానని అమరావతి వచ్చేశారు. కుత్బుల్లాపూర్‌ఎమ్మెల్యే టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకున్నారు. పొత్తు ఉందా లేదా.. అన్నదానిపై .. ఆయనేమీ పెద్దగా పట్టింపులకు పోవడం లేదు.

కాసాని బాటలోనే.. చాలా మంది నేతలు ఉన్నారు. పాత పరిచయాలతో.. మళ్లీ చంద్రబాబుతో కాంటాక్ట్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు.. ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి నేతల తాకిడి ఎక్కువగా ఉందంటున్నారు. టీడీపీ తరపున పోటీకి ఆసక్తి చూపిస్తున్న వారిని చూస్తూంటే.. తెలంగాణలో టీడీపీకి ఢోకా లేదని.. కింగ్‌ మేకర్‌ అవుతుందనే ధీమాను కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com