ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తే.. కేసీఆర్‌ను “ఆపద్ధర్మ పదవి” నుంచి తొలగిస్తారా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ .. తన చేతిలో అధికారం ఉంటే.. ఎంతగా రాజకీయాలను ప్రభావితం చేయగలరో.. గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు చూశారు. రాజ్యాంగంలో ఆపద్ధర్మం అనే పదే లేదని.. ఉన్న ప్రభుత్వాన్ని అన్ని అధికారాలు ఉంటాయని… కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అయితే.. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలా వద్దా అన్నది… కేవలం నైతిక పరమైన అంశమన్నారు. కేసీఆర్ రాజకీయంగా లాభం కలుగుతుందంటే.. కీలకమై నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగంపై పూర్తి పట్టు సాధించారు. అనుకూలమైన అధికారులందర్నీ కీలకమైన పోస్టుల్లో సర్దుబాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కేర్ టేకర్ సీఎం అయినా.. డైరక్ట్ సీఎం అయినా పెద్దగా పెద్దగా తేడా ఉండదు.

అందుకే కేసీఆర్ కచ్చితంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారని.. తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ నమ్ముతున్నాయి. బీజేపీ దగ్గర్నుంచి అందరూ.. కేసీఆర్‌కు ఆపద్ధర్మ పదవి వద్దని.. వెంటనే తెలంగాణలో రాష్ట్రపతి పాలనవిధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఒంటరిగా వెళ్తే.. గవర్నర్ పట్టించుకునే పరిస్థితి ఉండదు. తెలంగాణలోటీఆర్ఎస్ మినహా బీజేపీతోసహా.. అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లి.. గవర్నర్‌కు పిర్యాదు చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు.. టీ టీడీపీ నేతలు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. రాజ్‌భవన్ అధికారులు పదకొండో తేదీన సమయం ఇచ్చారు.

అన్ని పార్టీల నేతలను కలపుకుని వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేయడమే కాకుండా.. జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తున్న టి.టీడీపీ నేత ఎల్‌.రమణ ప్రయత్నిస్తున్నారు. గవర్నర్‌నరసింహన్‌ను కలిసేందుకు రావాలని…ఉత్తమ్‌, కోదండరామ్‌, చాడ వెంకటరెడ్డి, డా.లక్ష్మణ్‌కు ఎల్‌.రమణ ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు చెప్పినట్లుగా.. కేసీఆర్‌ను… ఆపద్ధర్మం నుంచి తొలగించి..గవర్నర్ రాష్ట్రపతి పాలన విధిస్తారనుకోవడ మాత్రం అమాయకత్వమే. ఎందుకంటే.. గవర్నర్ పొజిషన్ ప్రస్తుతం అలాగే ఉంది మరి. ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close