ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన అత్యంత అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీశాయి. ఈ వ్యవహారంపై వైసీపీ అగ్రనాయకత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అంబటి వ్యాఖ్యలను సమర్థించలేక, అలాగని ఖండించలేక ఆ పార్టీ నేతలు మింగలేక కక్కలేక అన్నట్లుగా మౌనం పాటిస్తున్నారు. ప్రజల్లో ఆయనపై కనిపిస్తున్న తీవ్ర ఆగ్రహం చూసి, ఈ సమయంలో నోరు తెరిస్తే అది పార్టీకి మరింత నష్టం కలిగిస్తుందని భయపడుతున్నట్లు కనిపిస్తోంది.
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే .. ఆ వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న అనుమానాలు బలపడతాయి. తిరుమల లడ్డూ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, కావాలనే చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దాడులు చేయాలని పార్టీయే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనుకోవచ్చు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే, అంబటి చేసిన ఈ బూతుల కుట్ర నుక వైసీపీ అధిష్టాన ప్రోద్బలం ఉందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయే అవకాశం ఉంది.
వైసీపీ నాయకత్వం బూతుల ఆలోచనలతోనే ఉంటుంది. చంద్రబాబును తిట్టడం ద్వార అలజడి రేపాలని అనుకుంటున్నారు. అంబటితో అదే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజలు తిరగబడి తరమికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు వైసీపీ నేతలకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అంబటిని సమర్థిస్తే ప్రజలు తిరగబడతారు.. వ్యతిరేకిస్తే.. బలి పశువును చేస్తారా అని పార్టీ క్యాడర్ ఫీలవుతుంది.
