ఎర్రబెల్లిపై రేగుతున్న పాత అనుమానాలు!

తెదేపా ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న నాయకుడు కూడా పార్టీ ఫిరాయించేశారు. ఎవ్వరైతే ఫిరాయింపులకు వ్యతిరేకంగా స్పీకరుకు లేఖలు ఇచ్చి, తమ పార్టీ గుర్తు మీద గెలిచి ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించమంటూ ఇన్నాళ్లూ పోరాడాడో, స్పీకరు ఎదుట ధర్నాలకు దిగాడో, కోర్టులో పిటిషన్లు వేసి కేసులు నడిపాడో అలాంటి కీలక నాయకుడు కూడా ఇప్పుడు ఫిరాయించేశారు. పైగా ఫిరాయింపుల చట్టం కూడా వర్తించకుండా ఉండే విధంగా పరిస్థితిని సానుకూలం చేసే దిశగా ఆయన చేరిక ఉంది. చంద్రబాబు, రేవంత్‌, లోకేశ్‌ తదితరులు ఎలా సమర్థించుకున్నప్పటికీ.. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
అయితే ఇలా అసలే వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న పార్టీని నట్టేట వదిలేసి వెళ్లిపోయిన నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుపై చాలాకాలంగా పార్టీలో ప్రచారంలో ఉన్న పాత అనుమానాలు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితికి కోవర్టు అని, ఆయన తెరాస అనుకూల రాజకీయాలను తెదేపాలో ఉండి నడిపిస్తున్నాడని, తెలుగుదేశాన్ని లోలోపలినుంచే దెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నాడని చాలాకాలంగా పుకార్లు ఉన్నాయి. ఇవేమీ నిరాధారంగా పుట్టిన పుకార్లు కాదు.

కొన్ని నెలల కిందటే ఎర్రబెల్లి తెరాసలోకి జంప్‌ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తాను స్వయంగా కేసీఆర్‌ క్యాంప్‌ ఆఫీసుకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు కూడా! అయితే వచ్చిన పుకార్లను ఆయన ఖండించి.. అభివృద్ధి పనుల కోసమే వెళ్లి కలిశానంటూ ఎర్రబెల్లి చెప్పుకున్నారు. అయితే అప్పట్లో ఆయన కేసీఆర్‌ తనతో స్పందించిన తీరు పట్ల కినుక వహించారని, తెరాసలో చేరడానికే వెళ్లినప్పటికీ.. ఆ పార్టీలో ప్రస్తుతం తనకు తెదేపాలో ఉన్నంత స్వేచ్ఛ ఉండదనే అనుమానాలతో ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. ఎర్రబెల్లి తెరాస కోవర్టుగా మారారనే అనుమానాలు అప్పట్లోనే మొదలయ్యాయి.

ప్రధానంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించినవి. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోవడానికి, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడానికి ప్రధాన కారణం ఎర్రబెల్లి దయాకర్‌ రావేనని, ఆయన ముందుగానే కేసీఆర్‌కు సమాచారం ఇచ్చేశాడని కొన్ని అనుమానాలు ఉన్నాయి. రేవంత్‌ పట్ల చాలా కాలంగా విభేదాలు ఉన్న ఎర్రబెల్లి.. ఆయనను పూర్తిగా ఇరికించేయడానికి ఇలా చేశారని కొందరు అంటూ ఉంటారు. ఆ కేసు తర్వాత.. ఈ ఇద్దరు నేతల మధ్య వైమనస్యాలు కూడా బాగా పెరిగాయి. ఎంతో గుంభనంగా గుట్టుచప్పుడు కాకుండా.. సాగించే ఓటుకు నోటు వంటి తెరవెనుక వ్యవహారం ఎలా రచ్చకెక్కిందంటే.. దాని వెనుక ఎర్రబెల్లి ఉన్నారని, రేవంత్‌ను ఇరికించడానికే ఆయన అలా చేశారని పుకార్లు వచ్చాయి.

ఇప్పుడు ఆయన వెళ్లి తెరాసలో చేరిపోయిన నేపథ్యంలో అలాంటి పుకార్లన్నీ నిజాలేనా అనే చర్చ కూడా మొదలైంది. ఎర్రబెల్లి ఇంత సీనియర్‌ నాయకుడిగా ఉంటూ, ఇన్నాళ్లూ తెలుగుదేశంలో కోవర్టు ఆపరేషన్‌ నిర్వహించాడా అనే చర్చ పార్టీలో సాగుతోంది. ఇంతటి సీనియర్‌ నాయకుడు, పార్టీ ద్వారా అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్‌ వంటి కీలక పదవులు కూడా అనుభవించిన నాయకుడు ఇలా కోవర్టు ఆపరేషన్‌ చేయడం అంటే.. ఇక భవిష్యత్తులోనూ ఏ పార్టీ కూడా ఏ నాయకుడినీ నమ్మడానికి అవకాశం ఉండదేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close