ఎడిటర్స్ కామెంట్ : బై .. బై .. !

” టెన్షన్ లో నీకేమీ తెలియడం లేదు కానీ బుల్లెట్ ఎప్పుడో దిగిపోయింది ” అని ఓ సినిమాలో హీరో విలన్ గ్రూపులో సభ్యుడితో అంటాడు. అంటే టెన్షన్ లో ఉన్నప్పుడు.. గర్వం తలకెక్కినప్పుడు అధికార మత్తులో దిగలేనంతగా ఉన్నప్పుడు తమకు జరిగిన నష్టం ఏమిటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. మొత్తం విషయం తెలిసిన తర్వాతనే వారు తెలివిలోకి వస్తారు. అది కూడా వేరే వారు చెప్పడం ద్వారా కాదు.. తమకు జరిగిన నష్టం కళ్ల ముందు సాక్షాత్కరించినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన పరిస్థితి మెల్లగా అర్థమవుతోంది. అందుకే ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాను లేకపోతే పథకాలు రావని అంటున్నారు. కానీ ఆయనకు అర్థం కాని .. తెలుసుకోలేని విషయం ఏమిటంటే.. సంక్షేమ పథకాలు ఆయనతో ప్రారంభం కాలేదు.. ఆయనతో అంతం కావు. ప్రజలకు ఈ విషయంపై క్లారిటీ ఉంటుంది. కానీ అధికార మత్తులో ఉండి సర్వం నేనే అనుకునే పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి జూన్ నాలుగో తేదీన అర్థమవుతుంది. కానీ ఆయన పాలన మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది.

పది లక్షల కోట్ల సంపద నిర్వీర్యం చేశానని ఆనందపడే పాలకుడ్ని ఎవరైనా భరిస్తారా !?

” జగన్ ను ఇష్టపడండి…లేకపోతే ద్వేషించండి.. కానీ ఆయన ఏపీకి చేసినంత నష్టం ఇంకవరూ చేయలేరు ” అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. అది వంద శాతం నిజం. సొంత రాజధానిపై కుట్రలు చేసుకునే పాలకుడు చరిత్లలో ఎవరూ ఉండరు జగన్ రెడ్డి తప్ప. అమరావతి విలువ ఎంత .. రాష్ట్ర భవిష్యత్ అంత.. భవిష్యత్ తరాల జీవితాలు వలస పోకుండా ఉండే అంత. అందుకే ప్రాణం పెట్టి అమరావతికి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. కానీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొత్తం నాశనం చేసేసింది. అమరావతిని నాశనం చేయడం వల్ల రూ. పది లక్షల కోట్లు సంపదను నాశనం చేసినట్లుగా ఓ సందర్భంలో విజయసాయిరెడ్డినే లెక్క చెప్పేశారు. అమరావతిని నిలిపివేస్తే.. రూ. పది లక్షల కోట్ల సంపద హుష్ కాకి అవుతుందనే.. చంద్రబాబు పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. అమరావతిని నిర్మిస్తే.. ఎలాంటి లాభం ఉండదని.. పైగా వడ్డీలు ఎక్కువగా కట్టుకోవాల్సి వస్తుందని.. ప్రభుత్వం వాదన వినిపిస్తూ వచ్చింది. కానీ ప్రణాళిక ప్రకారం అమరావతిని అభివృద్ధి చేస్తే..రూ. పది లక్షల కోట్లు వస్తాయని విజయసాయిరెడ్డి ఓ సందర్భంలో లెక్క చెప్పారు. రూ. పది లక్షల కోట్లు అంటే.. ఆంధ్రప్రదేశ్ అత్యంత భాగ్యవంతమైన రాష్ట్రాల్లో ఒకటిగా మారిపోతుంది. ఆదాయం ప్రకారం చూసుకుంటే.. పదేళ్ల రాష్ట్ర ఆదాయం. అమరావతిపై ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చు అని వాదిస్తోంది. రూ. పది లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద అభివృద్ధి చెందితే.. రూ. లక్ష కోట్ల పెట్టుబడి.. అసలు లెక్కే కాదు. అమరావతి తరలిస్తే ఎంత నష్టమో.. వారికి స్పష్టత ఉంది. ఆ మొత్తం రాష్ట్ర భవిష్యత్‌ను మార్చేసే అంత అని కూడా వారికి తెలుసు. అయినప్పటికీ.. సొంత రాష్ట్ర ప్రయోజనాలను.. నిర్వీర్యం చేయడానికి… రూ. పది లక్షల కోట్ల సంపదను.. హారతి కర్పూరం చేయడానికి వారు ఏ మాత్రం ఆలోచించలేదు. అమరావతి ఆ స్థాయికి వెళ్తే రాష్ట్రంలో యువతకు ఏ స్థాయి ఉద్యోగాలు వచ్చేవో ఊహించుకుంటే మనం ఎంత కోల్పోయామో అర్థమవుతుంది. మరి ఇలాంటి పాలకుడ్ని కొనసాగించడానికి ఎవరైనా ఓట్లేస్తారా ?

మానసిక ఆనందం కోసం ప్రతిపక్ష నేతల్ని, వ్యతిరేకుల్ని హింసించే వాళ్లను ఎవరు కోరుకుంటారు ?

ప్రజలకు పనికి వచ్చే ప్రతి ఒక్క పనిని ఆపేసి తాను జైల్లో ఉన్నప్పుడు గోడల మీద రాసుకున్నట్లుగా .. వాళ్లని అరెస్టు చేయాలి.. వీళ్లను అరెస్టు చేయాలి అని.. పగ బట్టి చేతిలో అధికారం ఉందని అరెస్టులు చేసుకోవడమే పాలన అన్నట్లుగా సాగిపోయింది. జగన్ రెడ్డి కక్ష సాధింపు కోసం అరెస్టు చేసిన ఒక్కరంటే ఒక్కరికైనా నష్టం జరిగిందా ?. కానీ మానసిక ఆనందం మాత్రం ఆయన పొందారు. అధికారం చేపట్టిన దగ్గర్నుంచి… వైసీపీ సర్కార్ పెద్దలకు.. ఎవరో ఒకర్ని జైలుకు పంపకపోతే నిద్ర పట్టేది కాదు. అదేం ఆనందమో కానీ.. నోటీసులు ఇస్తే ఎవరైనా వస్తారు..కానీ కేసు పెట్టిన సంగతి కూడా ఎవరికీ తెలియదు. అరెస్టు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ బయట పెడతారు. కక్ష సాధించడంలో అసాధారణ భావజాలం చూపినా సర్కార్.. రాజకీయ నేతల్ని వదిలి పెట్టలేదు. స్పీకర్‌గా పని చేసిన కోడెల శివప్రసాదరావు … తన పరువు పోయిందని.. ఆత్మహత్య చేసుకున్నారంటే.. ప్రభుత్వం ఎంత దారుణంగా.. కక్ష సాధింపులకు పాల్పడిందో.. అర్థం చేసుకోవడం సులభమే. ఒక్క కోడెల మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీ నేతలు.. గతంలో ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అచ్చెన్నాయుడు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర వరకూ అందర్నీ జైళ్లలో పెట్టారు. ఒక్కరంటే ఒక్కరి కేసులోనూ రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. చివరికి చంద్రబాబును అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందారు. చింతమనేని ప్రభాకర్ ను.. ఒక కేసు రిమాండ్ ముగిసే సమయంలో.. మరో కేసు చూపించి.. నెలల తరబడి జైల్లో పెట్టారు. ఓ సందర్భంలో ఆయనను గంజాయి కేసులో ఎన్ కౌంటర్ చేసే ప్రయత్నాలు కూడా చేశారంటే పరిస్థితి ఎంత ఘోరంగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పాలకుల మైండ్ సెట్… అక్కడే ఉంది. తమ కసి ఎంత తీర్చుకున్నామన్నదానిపైనే రోజువారీ కార్యకలాపాలు నడిచాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వారిపై తెలుగుదేశం పార్టీ ముద్ర వేయడం దగ్గర్నుంచి… వారిని నానా రకాలుగా.. వేధించడం వరకూ అన్నీ జరిగాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ అధికారంలో ఉండాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు ?

తల్లీ, చెల్లిపైనా తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తిని సీఎం స్థానంలో మరోసారి కోరుకుంటారా ?

వైఎస్ షర్మిల సొంత దారి చూసుకున్నారు. కానీ అన్న సహించలేకపోయారు. కుటుంబంలో తానొక్కడినే రాజకీయాలు చేయాలని షర్మిల ఎలా రాజకీయాలు చేస్తారని ఆమెపై మిగా ప్రతిపక్ష నేతలపై దాడి చేసినట్లుగా చేశారు. లోకేష్ పై ఎలా నిందలు వేశారో అలా షర్మిలపై వేశారు. అలా చేయడం వల్ల సొంత తల్లి శీలాన్ని శంకించినట్లు అవుతుందన్న కనీస విచక్షణకు వైసీపీ కార్యకర్తలు రాలేదు. ఈ పోస్టులు చూసి ఆమె కన్నీరు పెట్టుకుని అమెరికా వెళ్లిపోయారు. చెల్లి షర్మిల వైసీపీ సోషల్ మీడియా వెనుక జగన్ ఉన్నారని ఆయనకు తెలియకుండా జగన్ కుటుంబసభ్యులపై ఇంత ఘోరమైన నిందలు వేయరని తెలుసు. అందుకే షర్మిల అన్న అనేవాడే ఇలా చేస్తాడా అని ప్రశ్నించడం ప్రారంభించారు. చివరికి చెల్లి కట్టుకున్న చీర గురించి కామెంట్లు చేసి… ఇలాంటి వాడా ఇంతకాలం మనల్ని పారిపాలించి అని.. జనం సిగ్గుతో ముడుచుకుపోతున్నారు.

దేనిపైనా కనీస అవగాహన లేని వ్యక్తిని కొనసాగించాలనుకుంటారా ?

పల్నాడుకు నీళ్లుఅవసరం కాబట్టి మెడికల్ కాలేజీ కడుతున్నానని నిండు అసెంబ్లీలో గొప్పగా చెబుతారు. చేయూత అంటే చేపలు పట్టుకుని ఫిష్ మార్టులో అమ్ముకోవడం అంటే.. పోర్టు ముందు కాబట్టే ముంబై .. ముంబై అయిందంటారు.. చెన్నై చెన్నై అయిందంటారు.. పెద్ద పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు రావంటారు. పట్టపగలు సెల్ ఫోన్ లైట్లు వేయాలని సభికుల్ని కోరతారు. అసలు ఏ విషయంపై కూడా కనీస అవగాహన లేని ఈ వ్యక్తి ఇంత కాలం ఏపీని పరిపాలించాడంటే..బయట ఉండే ఏపీ ప్రజలు సిగ్గుపడతారు. ఇవన్నీ కొన్ని మెరుపులే. నిజంగా ఆయనకు ఉన్న పరిజ్ఞానం ఎంటో ప్రజలకు తెలియాలంటే… ఓపన్ డిబేట్ కు లేదా.. ప్రెస్మీట్ కు హాజరు కావాలి.కానీ తన గురించి బండారం మొత్తం బయటపడుతుందని ఆయన ఎప్పుడూ బయటకు రాలేదు. ప్రెస్ మీట్లు పెట్టలేదు.

బై .. బై !

ప్రజల నమ్మకాన్ని అమ్ముకునే వాళ్లలో మొదటి రకం ఏపీ సీఎం జగన్మహన్ రెడ్డి, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పీపీఏలు తప్పన్నారు… పోలవరం తప్పన్నారు.. బోగాపురం తప్పన్నారు..ఇంగ్లిష్ మీడియం తప్పన్నారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ తప్పే అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి అన్నీ చేశారు. చంద్రబాబు పాతికేళ్లకు పీపీఏలు చేసుకుంటే జగన్ రెడ్డి ముఫ్పై ఏళ్లకు చేసుకున్నారు.. అదేమిటయ్యా.. అంటే అలా చేసుకుంటే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. భోగాపురం విమానాశ్రయమే దండగని క్యాన్సిల్ చేసి.. మళ్లీ జీఎంతో ఒప్పందం చేసుకుని మళ్లీ ఓకే అన్నారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇలా చెప్పుకోవాలంటే.. ఆ ఘనతలు లెక్కలేనని.. దేశంలో కొన్ని వందల సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్ ప్రభుత్వమే. వ్యవస్థల్ని గౌరవించని ఇలాంటి వారిని పదవిలో ఎవరైనా ఉంచుతారా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజమౌళి ని తలదన్నే గ్రౌండ్ వర్క్!!

సినిమా తీయడం ఒక కళ అయితే దాన్ని మార్కెట్ చేసుకోవడం మరో కళ. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి పరిశ్రమకి ఎన్నో కొత్తదారులు చూపారు. మార్కెట్, పబ్లిసిటీ ఆవశ్యకతని తెలియజేస్తూ ప్రమోషనల్ కార్యక్రమాలని...

చిహ్నం మేమూ మారుస్తాం…హింట్ ఇచ్చేసిన బీజేపీ..!!

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై సర్కార్ సమాలోచనల నేపథ్యంలో ఆలస్యంగా మేల్కొన్న బీజేపీ తాజాగా కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. చిహ్నంలో ఎలాంటి మార్పులు చేయాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు చేయకుండా,...

బ‌చ్చ‌ల‌మ‌ల్లి @ రూ.14 కోట్లు

ఇటీవ‌ల కాలంలో ఓ సినిమా విడుద‌ల‌కు ముందే బిజినెస్ క్లోజ్ చేసుకోవ‌డం, నిర్మాత టేబుల్ ప్రాఫిట్ ద‌క్కించుకోవ‌డం చాలా అరుదైన విష‌యాలు. టీజ‌రూ, ట్రైల‌రూ బాగుండి, విప‌రీత‌మైన బ‌జ్ ఉంటే త‌ప్ప‌, ఏ...

సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు… బీజేపీ దిమ్మతిరిగే ప్లాన్..?

కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీయకుండా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది..? ఎన్నికల ప్రక్రియ ముగుస్తోన్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచడానికి కారణం ఏంటి..? ఫోన్ ట్యాపింగ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close