ఎడిటర్స్ కామెంట్ : “బిగ్‌బాస్” చూస్తున్నాడు..!

“నిజమైన దేశభక్తుని పని.. పాలకుల నుంచి తమ దేశాన్ని కాపాడటమే..!” అంటాడు 17వ శతాబ్దానికి చెందిన రాజకీయ పండితులు ధామస్ పైనే. ధాయస్ 17వ శతాబ్దంలో పరిస్థితుల గురించి చెప్పి ఉండవచ్చు. కానీ ఆ కొటేషన్‌కు ఇప్పటి ఇండియా పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. సొంత ప్రజలపై నిఘా పెట్టే పాలకుడ్ని ఏమంటారు..? ఉగ్రవాదల జాబితాలో తమకు వ్యతిరేకులందర్నీ చేర్చి వారిపై నిఘా పెట్టే వారినేమంటారు..? అలాంటి పాలకులు ఉంటే దేశం బాగు పడుతుందా..? ప్రజలు సుభిక్షంగా ఉంటారా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశ ప్రజలు మొత్తం వేసుకోవాలి. ఎందుకంటే…దేశంలో సంచలనం రేపుతున్న “పెగాసుస్ నిఘా” వెనుక ఉన్న బిగ్ బాస్ కేంద్రమే మరి.

వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే హక్కు ఎవరిచ్చారు..?

పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రయోగించి పలువురు కేంద్ర మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, ఎన్నికల కమిషనర్లు, పాత్రికేయులు, చివరికి సుప్రీంకోర్టు జస్టిస్‌లు సహా దేశంలోని 300 మంది ప్రముఖులపై నిఘా పెట్టిన వ్యవహారం వెలుగులోకి రావడం యాధృచ్చికమే. పెగాసస్ నిఘా ఎంత సీక్రెట్‌గా సాగుతుందో… ఆ వివరాలు కూడా అంతే సీక్రెట్‌గ ఉంటాయి. కానీ ఇప్పుడు ‌హ్యాక్ అయ్యాయన్న అనుమానంతో వారి వారి స్మార్ట్‌ ఫోన్లకు ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయిస్తేగాని ఈ వ్యవహారం బయటపడలేదు. ఆమ్నేస్టి ఇంటర్నేషనల్‌, ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌ పెగాసస్‌ నిఘాలో ఉన్న వారి జాబితాను వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్. ఇండియాలోని ‘ద వైర్‌’ మీడియా సంస్థలు ఆ వివరాలను ప్రచురించాయి. 45 దేశాలకు చెందిన 50 వేల మంది పేర్లు పెగాసస్‌ నిఘాలో ఉన్నట్లు వెల్లడి కాగా వెయ్యి మందిని గుర్తించారు. గుర్తించిన వారిలో 300కు పైగా భారత్‌కు చెందినవారే. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జి సహా పలువురు ఉపయోగించిన పోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి.

2019లోనే పెగాసస్ వినియోగం..! అప్పట్నుంటే ఇజ్రాయెల్ సంస్థ అమ్మకాలు..

పెగాసస్‌ అలజడి 2019లోనే ప్రారంభమయింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ సంస్థ పెగాసస్‌ స్పైవేర్‌ను రూపొందించి వివిధ దేశాల ప్రభుత్వాలకు విక్రయించింది. ఆ సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లో పలువురిపై నిఘా పెట్టిన ఉదంతం గుప్పుమంది. అప్పుడు మోడీ ప్రభుత్వం సరైన జవాబు చెప్పలేదు. అనధికారికంగా ఎవ్వరిపైనా నిఘా లేదని మాత్రమే పేర్కొంది. ఇప్పుడు మరోసారి పెగాసస్‌ నిఘా వ్యవహారం బయటికి పొక్కడంతో ప్రభుత్వం వైపే అందరూ అనుమానంగా చూస్తున్నారు. నిఘఆ బారిన పడిన వారి వివరాలనుచూస్తే బట్టి హ్యాకింగ్‌ ఎవరిపనో, ఎవరికి ఆ అవసరం ఉందో అర్థమవుతుంది. పెగాసస్‌ వంటివి కరడుగట్టిన ఉగ్రవాదులను, తీవ్రాతితీవ్ర నేరాలు చేసిన క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి తప్ప ప్రజలపై నిఘా పెట్టడానికి కాదు. సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వాలకే అమ్ముతారు. అలాంటప్పుడు ఇండియాలో ఆ స్పైవేర్ వాడేది కచ్చితంగా భారత ప్రభుత్వమే. ప్రైవేటు వ్యక్తులు వాడే పరిస్థితి లేదు. వారు వాడితే మరీ ప్రమాదకరం.

రూ. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రజలపై నిఘా కోసం తెప్పించిన పెగాసస్..!

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం సామాన్యుల వల్ల అయ్యే పని కానే కాదు. ఎన్‌ఎస్‌ఓ టెక్నాలజీస్‌ స్వయంగా చెప్పినట్లు, ప్రభుత్వాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు మాత్రమే కొనుగోలు చేయగలవు. ఉపయోగించగలవు. ఖరీదు కోట్లలోనే 2016లో న్యూయార్క్‌ టైమ్స్‌ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే.. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టలేషన్‌ చార్జీనే దాదాపు రూ.3.5 కోట్లు ఉంటుంది. యాభై మందిపై నిఘాకు రూ.3.5 కోట్లు, సంఖ్య 20 అయితే కోటి రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. భారత్‌లో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ బారిన పడ్డ వారి సంఖ్య దాదాపు 300 అన్నది నిజమైతే.. మొత్తం ఖర్చు సుమారు 40 లక్షల డాలర్లు లేదా రూ.28 కోట్లు అవుతుందన్నమాట. మెయింటెనెన్స్‌ చార్జీలు, ఇతర ఖర్చులు కూడా కలుపుకుంటే.. మొత్తం ఖర్చు రూ.యాభై కోట్ల వరకూ అయి ఉండవచ్చునని అంచనా. ఇంత మొత్తాన్ని చెల్లించి కేంద్రమో.. రాష్ట్ర ప్రభుత్వాలో.. ఈ సాఫ్ట్ వేర్ సేవలను వినియోగించుకుని ఉంటాయి.

ట్యాపింగ్.. మ్యాపింగ్ లేని రాష్ట్రమే లేదు..!

ఒక్క కేంద్రమే కాదు.. రాష్ట్రాల్లోనూ ట్యాపింగ్ గొడవలు ఉన్నాయి. పలు మార్లు ప్రభుత్వాలను మార్చే రాజకీయాలు జరిగినప్పుడు ఆడియో టేపులు వెలుగులోకి వచ్యాయి. ఏపీలోనూ.. తెలంగాణలోనూ అంతే. ధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తోటి శాసన సభ్యులతో సాధారణ ఫోన్‌కాల్‌లో మనసువిప్పి మాట్లాడటానికి వణుకుతున్నారంటే పరిస్థితి అర్థమౌతుంది. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో ఘునందన్‌ తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులపైనే నిఘా పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి.

“బిగ్ బాస్”.. తాను చూడటం లేదని నిరూపించుకోవాలి..!

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రభుత్వాల వద్ద మాత్రమే ఉంటుంది. జాతీయ భద్రత, ఉగ్రవాదం మినహా మిగిలిన అంశాల కోసం భారత ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఉంటే అది కచ్చితంగా అక్రమమే. ఒకవేళ ప్రభుత్వం వాడకపోయి ఉంటే మరీ ప్రమాదం. జాతీయ భద్రతకు భంగం కలిగినట్లే. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌పై న్యాయ విచారణ జరగాల్సిందే. కానీ ఇక్కడ ప్రభుత్వమే ఆ పనికి పాల్పడుతోంది. మరి నిజాన్ని వెలికి తీసేదెవరు..?ప్రజల్ని కాపాడెదేవరు..? ఇంకెవరు. బిగ్ బాస్ నుంచి ప్రజలు తమను తామే కాపాడుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close