గీతా ఆర్ట్స్‌లో క‌థ‌ల ‘బ్యాంక్‌’

టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో గీతా ఆర్ట్స్ ఒక‌టి. ఆమ‌ధ్య సినిమాలు తీయ‌డంలో కాస్త బ‌ద్ద‌కించిన గీతా ఆర్ట్స్.. ఇప్పుడు మాత్రం ఎప్పుడూ లేనంత జోరుగా సినిమాలు చేస్తోంది. జీ.ఏ 2 కూడా తోడ‌వ్వ‌డంతో… ఆ ఊపు మ‌రింత పెరిగింది. సినిమాలు తీయాలంటే క‌థ‌లు కావాలి క‌దా? అందుకే క‌థ‌ల కోసం గీతా ఆర్ట్స్ చాలా క‌సర‌త్తులు చేస్తోంది. గీతా ఆర్ట్స్ ఆఫీసు ఇప్పుడు ద‌ర్శ‌కుల‌తో, క‌థ‌కుల‌తో సంద‌డిగా మారింది. రోజుకి ప‌ది క‌థ‌లైనా వింటోంది గీతా ఆర్ట్స్ టీమ్. ఇందుకోసం వి.ఎన్‌.ఆదిత్య‌, వాసు వ‌ర్మ లాంటి ద‌ర్శ‌కులు గీతా ఆర్ట్స్‌కి స‌హాయం చేస్తున్నారు. ఎవ‌రైనా స‌రే.. ముందు వీళ్ల‌కే క‌థ చెప్పాలి. వీరిద్ద‌రూ స్క్రూటినీ చేసి… అల్లు అర‌వింద్ లేదా, బ‌న్నీ వాసుల‌కు వినిపిస్తారు. అక్క‌డ ఓకే అయితే… స‌ద‌రు ద‌ర్శ‌కుడికి అడ్వాన్సులు ఇచ్చి, ఆఫీసు రూమ్ కేటాయిస్తున్నారు. ఇలా గీతా ఆర్ట్స్‌లో అడ్వాన్సులు తీసుకుని, క‌థ‌లు రెడీ చేస్తున్న‌వాళ్లు దాదాపు ప‌దిమంది కి పైగానే ఉన్నారు. 2019లో గీతా ఆర్ట్స్‌, జీఏ 2 నుంచి ఏకంగా ఆరేడు సినిమాలైనా ప‌ట్టాలెక్క‌బోతున్నాయ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో మెగా హీరోలే కాదు, బ‌య‌టి స్టార్ హీరోలూ న‌టించ‌బోతున్నారు. చిన్న క‌థ‌ల‌కు, చిన్న హీరోల‌కు జీఏ 2 ఎలానూ ఉంది. మొత్తానికి గీతా ఆర్ట్స్‌.. క‌థ‌ల బ్యాంకు ఒక‌టి ఏర్పాటు చేసి – సినిమా నిర్మాణాన్ని మ‌రింత ఉధృతం చేసే ఆలోచ‌న‌లో ఉంది. ప‌రిశ్ర‌మ‌కు ఇలాంటి సంస్థ‌లే క‌దా, కావాల్సింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close