# RRR లో…. ‘అర్జున్‌రెడ్డి’ క‌మెడియ‌న్‌

రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ # RRR కి సంబంధించిన న‌టీన‌టుల లిస్టు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు మిన‌హాయిస్తే… అధికారికంగా ఎవ్వ‌రూ ఖ‌రార‌వ్వ‌లేదు. క‌థానాయిక‌ల ఎంపిక ఇంకా జ‌రుగుతూనే ఉంది. ఈసినిమాలో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తాడ‌న్న వార్త‌లు వినిపిస్తున్నా.. అది ఎంత వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది చిత్ర‌బృందమే చెప్పాలి. అయితే.. ఇప్పుడో క‌మెడియ‌న్‌కి మాత్రం # RRR లో స్థానం ద‌క్కింది. `అర్జున్‌రెడ్డి`తో ఆక‌ట్టుకున్న రాహుల్ రామ‌కృష్ణ ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని… రామ‌కృష్ణ ధృవీక‌రించాడు కూడా. ”ఆర్‌.ఆర్‌.ఆర్‌లో నాకు అవ‌కాశం వ‌చ్చింది.అది ఎలాంటి పాత్ర అనేది ఇప్పుడే చెప్ప‌కూడ‌దు” అంటూ దాటేశాడు రాహుల్‌. ‘అర్జున్ రెడ్డి’ త‌ర‌వాత‌.. రాహుల్‌కి మంచి అవ‌కాశాలే వ‌స్తున్నాయి. ‘భ‌ర‌త్ అనే నేను’లోనూ మంచి పాత్రే చేశాడు రాహుల్. అయితే… ఆ పాత్ర‌పై త‌న‌కు ఇంకాస్త అసంతృప్తి ఉంద‌ట‌. ”భ‌ర‌త్ అనే నేనులో ఇంకాస్త బాగా చేయాల్సింది అనిపించింది. ఈ విష‌యాన్ని కొర‌టాల శివ‌తోనే చెప్పా” అంటున్నాడు రాహుల్‌. త‌న‌కు ఇలా కామెడీ పాత్ర‌లతోనే కొన‌సాగాల‌ని లేద‌ని, అన్ని ర‌కాల పాత్ర‌లూ చేయాల‌న్న ఆస‌క్తి ఉంద‌ని, ద‌ర్శ‌కులు మాత్రం కామెడీ క‌థ‌ల‌తోనే వ‌స్తున్నార‌ని వివ‌రించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close