శ్రియ‌కు మంచి రోజులొచ్చిన‌ట్టే

ఒక‌ప్పుడు మంచి దూకుడు చూపించిన క‌థానాయిక‌ల్లో శ్రియ కూడా ఉంది. అందం, అభిన‌యం క‌ల‌బోసి – ఇంటిల్లిపాదినీ ఆక‌ట్టుకొంది. స్టార్‌గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్‌కీ వెళ్లింది. అక్క‌డే స్థిర‌ప‌డాల‌న్న ఉద్దేశంతో తెలుగు సినిమాల్ని ప‌ట్టించుకోలేదు. దాంతో అటు హిందీ సినిమాలూ రాక‌, ఇటు తెలుగువాళ్లు తీసుకోక రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది శ్రీ‌య కెరీర్‌. వ‌య‌సు మీద ప‌డ‌డం, కొత్త క‌థానాయిక‌ల హ‌వా మొద‌ల‌వ్వ‌డంతో శ్రియ‌ని మ‌ర్చిపోయారు. తెలుగులో శ్రియ కెరిర్‌కి పుల్ స్టాప్ ప‌డుతుంద‌న్న స‌మ‌యంలో గోపాల గోపాల‌తో ఛాన్స్ వ‌చ్చింది. ఆ సినిమాతో రీ ఎంట్రీ అందుకొన్న శ్రియ‌.. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణిలో న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకొంది. శాత‌క‌ర్ణితో శ్రియ సెకండ్ ఇన్నింగ్స్‌కి ఊపొచ్చింది. ఇప్పుడు బాల‌కృష్ణ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు ‘న‌క్ష‌త్రం’లో శ్రియ ఐటెమ్ గాళ్‌గా క‌నిపించ‌నుంది. ఇప్పుడు నారా రోహిత్ సినిమాలోనూ ఓ కీల‌క పాత్ర‌కు ఎంపికైంది శ్రియ‌. రోహిత్, శ్రీ విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘వీర భోగ వ‌సంత రాయులు’ చిత్రం తెరకెక్క‌నుంది. ఇందులో శ్రియ‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. ముదురు భామ‌ల్ని ఇక చూడ‌రు.. వాళ్ల‌ని ప‌ట్టించుకోరు అనుకొంటున్న త‌రుణంలో శ్రియ వ‌రుసగా అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌డం విశేషమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com