ఐ.రా.సలో ప్రసంగించేందుకు చంద్రబాబుకు అనుమతి ఉందా?: జీవీఎల్‌

చంద్రబాబు అమెరికా పర్యటనపై జీవీఎల్ నరసింహారావు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు చంద్రబాబుకు అనుమతి ఉందా? అని కొత్త ప్రశ్న లేవనెత్తారు.

ఎన్నికల సమయంలో అమెరికా పర్యటన అనుమానాలకు తావిస్తోందని కొత్త అనుమానాలు వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు…బ్యాంకులతో ఏపీ రూ. 16వేల కోట్ల రుణ ఒప్పందం జరిగిందని ఈ ఒప్పందం పనిమీదనే చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు అనుమానాలున్నాయంటుననారు. చంద్రబాబు పర్యటన పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిజానికి జీవీఎల్ మూడు రోజుల నుంచి… చంద్రబాబు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడం లేదుని.. ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగిస్తున్నారని వాదిస్తున్నారు. మీడియా ముందు చెబుతున్నారు. వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి కార్యక్రమాల లిస్టులో చంద్రబాబు కార్యక్రమాల వివరం లేదంటూ… మళ్లీ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు పట్టుకుని జగన్ మీడియా కావాల్సినంత దుష్ప్రచారం చేస్తోంది. నిజానికి ఐక్యరాజ్య సమితి వెబ్ సైట్లో… చంద్రబాబు పాల్గొనే కార్యక్రమ వివరం.. సమయం స్పష్టంగా ఉంది. భారతీయ సమయం ప్రకారం.. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య చంద్రబాబు ప్రసంగిస్తారని.. అందులో ఉంది. దాన్ని దాన్ని సోషల్ మీడియాలో టీడీపీ నేతలు జీవీఎల్ కు ట్యాగ్ చేశారు. అంతే హఠాత్తుగా…మాట మార్చి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి పర్మిషన్ ఉందా అన్న అనుమానాలు లేవనెత్తడం ప్రారంభించారు. నిజానికి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వవరాలు కేంద్రం వద్ద ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి.. విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చినా.. కేంద్రం నుంచి కచ్చితంగా అనుమతి రావాల్సి ఉంటుంది. టూర్ డీటైల్స్‌ మొత్తం ఉంటాయి. ఇక అప్పులు తీసుకోవడం గురించి కొత్త ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాలు అప్పులు తీసుకోవాలన్నా… దానికో ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు అప్పులు ఇస్తే.. అది కేంద్రం పర్యవేక్షణలోనే ఇస్తాయి కానీ… నేరుగా రాష్ట్రానికి ఇవ్వవు. ఆ విషయం తెలిసి కూడా జీవీఎల్.. ఏదో ఒకటి అనాలి కాబట్టి.. అంటూనే ఉన్నారు.

చంద్రబాబు ప్రసంగం అయిపోియన తర్వాత అది ప్రైవేటు కార్యక్రమని.. జీవీఎల్ ఆరోపించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఈ కార్యక్రమాన్ని వరల్డ్ ఎకనమిక్ ఫోరం, బీఎన్బీ పరిబస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధం లేదని.. చెప్పొచ్చు. ఐరాస భవనం ఏమీ పెళ్లి మండపం కాదు.. ఆయా సంస్థలు సదస్సులు నిర్వహించుకునేదుకు అద్దెకు ఇచ్చుకోవడానికి. ఈ విషయం జీవీఎల్ కు అవసరం లేకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close