అమెరికాకు వెళ్లేందుకు శివాజీకి హైకోర్టు పర్మిషన్..!

శివాజీని దుబాయ్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వెనక్కి పంపడానికి కారణం… తమకు తెలియదని హైదరాబాద్ పోలీసులు చెప్పినదంతా అబద్దమేనా..? ఉద్దేశపూర్వకంగానే… శివాజీపై లుకౌట్ నోటీసులు ఎత్తి వేయాలని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ.. ఎత్తివేయలేదా..?. తాజాగా శివాజీ వేసిన ఓ పిటిషన్‌పై.. హైదరాబాద్ పోలీసుల వాదన ఇంతే ఉంది. సమాచార లోపం వల్లే.. హైకోర్టు ఆదేశించినప్పటికీ.. లుకౌట్ నోటీసులు ఎత్తి వేయలేకపోయామని.. ఇండియాలో ఎవరూ.. శివాజీని అడ్డుకోలేదని.. విదేశాల్లోనే అడ్డుకున్నారని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకొచ్చారు.

గత నెల ఇరవై నాలుగో తేదీన శివాజీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. 25వ తేదీన శివాజీని దుబాయ్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. కోర్టు ఉత్తర్వులను తెలంగాణ పోలీసులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. శివాజీ మరో సారి హైకోర్టులో పిటిషన్ వేశారు. లుకౌట్‌ నోటీసులు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు తొలగించలేదని శివాజీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆయన అమెరికా వెళ్తుండగా పోలీసులు ఆపారన్నారు.

ఇమ్మిగ్రేషన్‌ వెబ్‌సైట్‌లో లుకౌట్‌ నోటీసులు తొలగించలేదన్నారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని శివాజీ న్యాయవాది కోరారు. అయితే పోలీసులు మాత్రం.. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత లుకౌట్‌ నోటీసులు తొలగించడానికి మూడు రోజులు పడుతుందని హైకోర్టుకు తెలిపారు. దీంతో.. సమాచారలోపం వల్ల ఇదంతా జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది. శివాజీ మూడు వారాల వరకు అమెరికా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close