సాహో.. ప్ర‌మోష‌న్ ప్లాన్స్ ఇవే!

సాహో విడుద‌ల‌కు ఇంకా మూడు వారాల స‌మ‌య‌మే ఉంది. ఈలోగా ప్ర‌మోష‌న్స్ పీక్స్‌లో చేయ‌డానికి చిత్ర‌బృందం రెడీ అయిపోతోంది. ఈనెల 10న ట్రైల‌ర్‌ని విడుదల చేయ‌నున్నారు. అన్ని భాష‌ల్లోనూ ట్రైల‌ర్ ఒకేసారి విడుద‌ల కానుంది. 11, 12, 13, 14న ప్ర‌భాస్ నాలుగు భాష‌ల్లోనూ ప్ర‌మోట్ చేయ‌డానికి ఓ ప్ర‌మోష‌న్ టూర్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కొచ్చి, బెంగ‌ళూరు, ముంబై, చెన్నైల‌లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప్ర‌భాస్ స్థానిక అభిమానుల్ని క‌లుసుకోబోతున్నాడు. దిల్లీలో ఓ పాట‌ని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అన్నీ కుదిరితే… 16న దిల్లీ వెళ్తాడు ప్ర‌భాస్‌. ఈనెల 18న రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేయ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌మౌళి అతిథిగా రాబోతున్నాడు. టాలీవుడ్ నుంచి ఇంకొంత‌మంది స్టార్స్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన‌బోతున్నారు. మొత్తానికి ప్ర‌భాస్ ఈ నెలంతా… ప్ర‌మోష‌న్ల‌తో బిజీ అవ్వ‌బోతున్నాడు. దాదాపు 300 కోట్ల‌తో రూపొందించిన సినిమా ఇది. ప్ర‌మోష‌న్లు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close