జగన్ అమరావతిని చంపేశారని తేల్చిన చంద్రబాబు ..!

అమరావతిని నిలిపి వేయడానికి .. తాను అవినీతి చేయడమే కారణమని చెప్పేందుకు.. ఏపీ సీఎం జగన్ తాపత్రయపడుతున్నారని.. చంద్రబాబు అనుమానిస్తున్నారు. అమరావతి భూసమీకరణలో కుంభకోణం జరిగిందంటూ… ప్రధానమంత్రి మోడీకి జగన్… ఓ ప్రత్యేకమైన నివేదిక ఇచ్చారన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. ఈ క్రమంలో.. చంద్రబాబు… జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు అమరావతి ప్రస్తావన తీసుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావితరాలు ఇతర రాష్ట్రాలకు వలస పోకుండా.. మన రాష్ట్రంలోనే… ఉపాధి అవకాశాలు కల్పించే రాజధానిని నిర్మించుకుందామన్న ఆలోచనతో అమరావతిని పట్టాలెక్కిస్తే.. ఇప్పటి ప్రభుత్వం దాన్ని చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మనం మొదలుపెట్టిన ప్రపంచస్థాయి రాజధాని నేడు వెలవెలబోతోందని.. తన మీద కోపంతో అమరావతిని చంపేశారని చంద్రబాబు అంటున్నారు. అమరావతిలో అవినీతి జరిగిందంటూ.. ప్రధానికి.. సీఎం జగన్.. నివేదిక ఇచ్చారని మీడియాలో వచ్చిన అంశంపైనా స్పందించారు. అమరావతిలో ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానిని కలిస్తే రాష్ట్రానికి నిధులు అడుగుతారు కానీ.. జగన్ మాత్రం.. తనపై ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… పార్టీ కార్యకర్తలతో ఎప్పుడు సమావేశమైనా.. తనకు 23 సీట్లు మాత్రమే ఇచ్చేంత తప్పేం చేశాననే ప్రశ్న వేసుకుంటున్నారు.

తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదని… ఏపీ ప్రజలు పాలిచ్చే అవును వదిలేసి… దున్నను తెచ్చుకున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎందుకు ఓడిందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. పట్టిసీమ నీళ్లు తాగిన వాళ్లు కూడా.. టీడీపీకి ఓటేయడం మర్చిపోయారని.. ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపైనా… చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా నిలిపివేశారన్నారు. అభివృద్ధి ఆపేశారని..పాలన వదిలేసి అరాచకాలు చేస్తున్నారని మండి పడ్డారు. వైసీపీ నేతలు ఇసుక లారీలు పంచుకుంటున్నారని.. పల్నాడులో ప్రజలు గ్రామాలు వదిలిపోతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలంటున్న జగన్.. రైతు రుణమాఫీ హామీని ఎందుకు నెరవేర్చరని ప్రభుత్వాన్ని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close