జగన్ సర్కార్ చెప్పిందల్లా చేసి నేరస్తుడైన జడ్జి !

కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న మనోహర్‌ రెడ్డిని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఆయన జడ్జి పోస్టులో ఇంకా కూర్చోవడం కొనసాగడం న్యాయవ్యవస్థ ప్రయోజనాలకు హానికరమని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ సస్పెండైన జడ్జి మనోహర్ రెడ్డి ఏం చేశారంటే “తమ” ప్రభుత్వం వచ్చిందని.. పదవి ఇచ్చిందని ఏది అడిగితే అది చేసేశారు. ఫలితంగా ఆయన న్యాయమూర్తిగా విశ్వాసాన్ని కోల్పోవడమే కాదు.. అవినీతి చేసి ఆధారాలతో సహా దొరికిపోయారు.

మనోహర్ రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి సీఎం గానే ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయన హయాంలో అనేకమంది స్పెషల్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. కానీ ఆ నియామకాలన్నీ అవినీతితో జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అర్హతలు, సమర్థతతో సంబంధంలేకుండా, అధికారపార్టీ పెద్దల సిఫారసుల మేరకే వారిని నియమించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ అసోసియేషన్‌ నేరుగా ఆధారాలతో హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక ఆధారాలు ఉండటంతో హైకోర్టు మొదట ఆయనను న్యాయశాఖ కార్యదర్శి పదవి నుంచి తప్పించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొదట ఒప్పుకోలేదు. తర్వాత తప్పలేదు. కానీ ఇప్పటికీ న్యాయశాఖ కార్యదర్శి పోస్టును భర్తీ చేయలేదు.

మనోహన్ రెడ్డిని బదిలీ చేసిన తర్వాత హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడినట్లుగా గుర్తించామని.. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఏపీ సివిల్‌ సర్వీసు రూల్స్‌-1991 ప్రకారం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మనోహర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నామని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ప్రభుత్వం విచారణ జరిపి మనోహర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వమే ఆయనతో ఆ తప్పులు చేయించింది కాబట్టి అలాంటి చాన్స్ లేదు. కానీ న్యాయమూర్తిగా గౌరవనీయ స్థానంలో ఉండి.. చేయకూడదని తప్పులు చేసిన మనోహర్ రెడ్డి వ్యవస్థ ముందు దోషిగా నిలబడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close