తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే..! కేసీఆర్ వ్యూహమే..!!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. బీసీలకు ఏ ప్రాతిపదికన 34% రిజర్వేషన్లు కేటాయించారని హైకోర్టు ప్రశ్నించింది. బీసీ-ఏ,బీ,సీ రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసిందని తెలిపిన అటార్నీ జనరల్ 2, 3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కాన హైకోర్టు మాత్రం రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేసింది. తెలంగాణలో గ్రామ పంచాయతీల పదవీ కాలం జూలై 31తో ముగుస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియకు కావాలసిన ఏర్పాట్లు చేస్తోంది… రాష్ట్ర ఎన్నికల కమిషన్. బీసీ గణన పూర్తి చేసి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించింది.
పంచాయతీల ఎన్నికల్లోనూ యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికి భిన్నంగా ఉమ్మడి రాష్ట్రంలో 2012లో 34 శాతం బీసీ రిజర్వేషన్ తో ఎన్నికలు నిర్వహించాలని భావించారు. దీనిపై దాఖలైన కేసును విచారించిన హైకోర్టు… 50 శాతం రిజర్వేషన్ మించకుండా సుప్రీంకోర్టు తీర్పును యథావిధిగా అమలు చేయాలని ఆదేశించింది. దీనిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి… ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయని, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఒక్కసారికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 2012 పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశమిచ్చింది.

ఇపుడు యాభై శాతం రిజర్వేషన్ మించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే యాభై శాతం రిజర్వేషన్ దాటకూడదంటే బిసిలకు 29 శాతం రిజర్వేషన్ మాత్రమే అమలు చేయాలి. కానీ పంచాయతీ ఎన్నికలలో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది తెలంగాణా ప్రభుత్వం. ఈ అంశం వివాదాస్పదం కాకుండా కొత్తగా రూపొందించిన తెలంగాణా పంచాయతీరాజ్ చట్టంలోనే పంచాయతీల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ అమలును ప్రస్తావించారు. చట్టంలోనే పొందుపరిచినందున కోర్టుల ఇబ్బంది ఉండదనేది ప్రభుత్వ వాదన. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఈ చట్టం తయారు చేశారు కాబట్టి… యాభై శాతం నిబంధనను పాటించాల్సిందేని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం బిసిలకు 34 శాతం నిబంధన చేర్చింది. ఇప్పుడజు వ్యవహారం కోర్టులో పడింది. ముందస్త ఎన్నికల హడావుడి పెరుగుతున్న సమయంలో.. ఇక పంచాయీత ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం అసాధ్యమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ 30 ఫీట్ ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే !

తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో...

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

రీఎంట్రీకి శిశికళ రెడీ !

తమిళనాట స్టాలిన్‌కు పోటీ ఎవరు అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నామలైకు తమిళనాడులో తప్ప బయట కావాల్సినంత హైప్ వస్తోంంది. తమిళనాడులో పట్టించుకునేవారు లేరు. పన్నీరు సెల్వం,...
video

కల్కి.. సమయం చూడని సమరం

https://www.youtube.com/watch?v=5UfGZFrXKig మూడు సార్లు వాయిదా పడ్డ ‘కల్కి 2898 ఎ.డి’ భైరవ పాట ఎట్టకేలకు విడుదలైయింది. సంతోష్ నారాయణ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రచించిన ఈ పాట... దిల్జీత్‌ దోసాంజ్, దీపక్‌ బ్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close