సోనియాకే సన్మానం – కేసీఆర్‌కు లేదు !

తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఈసీ కూడా అనుమతి ఇచ్చింది. తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ పార్టీ నేతలు అభివర్ణించే సోనియా గాంధీకి కనీవినీ ఎరుగని రీతిలో సన్మానం చేయనున్నారు. ఇదే వేదికపై కేసీఆర్‌కు కూడా సన్మానం చేస్తారన్న ప్రచారం జరిగింది. అధికారికంగా ఆహ్వానం పంపే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు.

కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేదికపై కేసీఆర్‌కు సన్మానం అనే ప్రశ్నే ఉండదని కాంగ్రెస్ వర్గాలు తేల్చేశాయి. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియా గాంధీకే పూర్తి స్థాయి క్రెడిట్ ఉందని కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని గుర్తించే అవకాశం లేదని అంటున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకూ ఆహ్వానం వెళ్లే అవకాశం ఉంది. ఓ అతిథిగా హాజరవ్వాలని ఆయనకు ఇన్విటేషన్ పంపవచ్చు కానీ సన్మానం చేసే చాన్స్ లేదని చెబుతున్నారు.

సోనియా, రేవంత్ రెడ్డిలతో కలిసి కేసీఆర్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశాలు కూడా లేవు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ మాటిచ్చారు. కానీ తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత కేసీఆర్ కుటుంబం అంతా కలిసి సోనియాను కలిసిన తర్వాత మరోసారి కలవలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కూడా రేవంత్‌కు కేసీఆర్ వైపు నుంచి ఇప్పటి వరకూ శుభాకాంక్షలు కూడా అందలేదు. తాను సాధించిన తెలంగాణ అనే భావన లో ఉన్న కేసీఆర్ వారితో కలిసి వేదిక పంచుకునే అవకాశాలే ఉండవని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్మ ఈజ్ తాడేపల్లి ప్యాలెస్ !

నువ్ ఏది ఇస్తే నీకు అది తిరిగి వస్తుంది. ఇది గీతలో కృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతం. చాలా మంది మనుషులకు కూడా తీరిక ఉండదు కానీ.. ...

రూ.100 కోట్ల సినిమా… ఐనా ట్రోల్స్ తప్ప‌డం లేదు

అదేంటో గానీ, మంచు కుటుంబం నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే ట్రోల‌ర్స్ త‌మ‌కు కావ‌ల్సినంత మ‌సాలా దొరికింద‌ని తెగ సంబ‌ర‌ప‌డిపోతుంటారు. ఆ అంచ‌నాల్ని మంచు కుటుంబం కూడా మంచిగా నిల‌బెట్టుకొంటూ వ‌చ్చింది. సినిమా...

బీఆర్ఎస్ పై గురిపెట్టిన బీజేపీ!

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్...

సర్కార్ పై సమరం… ప్లాన్ మార్చిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ పై సమరమేనని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలు ముగిసి నెల రోజులు అవుతున్నా మౌనం వీడటం లేదు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ నిర్దేశించుకున్న వంద రోజుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close