మందు బాబులు ఆద‌ర్శం అంటున్న చంద్ర‌బాబు!

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని మొద‌ట బేష‌రతుగా అంగీక‌రించి, స్వాగ‌తించింది ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ త‌రువాత‌, వాస్త‌వాలు గ‌మ‌నించి కాస్త గొంతు స‌వ‌రించుకున్నా, ప్ర‌ధానమంత్రి మోడీ నిర్ణ‌యానికి అనుగుణంగానే న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించే ప‌నిలోప‌డ్డారు. క్యాష్ లెస్ ట్రాంజాక్ష‌న్లు పెంచుకోవాలంటూ ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. క్యాష్ లెస్‌ను ఎంక‌రేజ్ చేసేందుకు ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్టు చెప్పుకొస్తున్నారు. డ్వాక్రా మ‌హిళ‌కు ఉన్న‌ప‌ళంగా కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాల‌నీ, అంద‌రూ మొబైల్ బ్యాకింగ్ సేవ‌లు అల‌వాటు చేసుకోవాల‌ని చెప్పారు. అన్ని లావాదేవీలూ ఆన్‌లైన్‌లో జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నారు. అందుకు ఆద‌ర్శంగా ఎవ‌రికి తీసుకోవాలంటే… మందు బాబుల్ని అని చంద్ర‌బాబు తాజాగా చెప్ప‌డం విన‌డానికి కాస్త విడ్డూరంగా ఉంది!

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకుని నెల‌రోజులు దాటిపోయాయి. దీంతో రాష్ట్రాల ఆదాయాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయ‌న్న ఆందోళ‌న మెల్ల‌మెల్ల‌గా బ‌య‌ట‌కి వస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి న‌ష్టాల గురించి చూఛాయ‌గా బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా న‌ష్టాల గురించి మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు! నోట్ల ర‌ద్దు వ‌ల్ల అన్ని ర‌కాల వ్యాపారాలూ ఇబ్బందుల్లో ఉన్నాయ‌న్నారు. చేతిలో పైస‌లు లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు సొంత ప‌నులు మానుకుంటున్నార‌నీ, చివ‌రికి ప్ర‌యాణాలుకూడా ర‌ద్దు చేసుకుంటున్నార‌ని అన్నారు. అన్నింటికీ ఆన్‌లైన్ లావాదేవీలు ఉన్నాయ‌నీ, ప‌రిష్కారం అక్క‌డుంద‌ని అన్నారు. ఆన్‌లైన్‌లో మ‌ద్యం విక్ర‌యాలు గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. మందు బాబులు చేస్తున్న‌ట్టుగానే, ఇత‌ర లావాదేవీల‌న్నీ న‌గ‌దు ర‌హితంగా జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు!

ఓ ర‌కంగా చూస్తుంటే.. మందు బాబులకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ల‌హా ఇచ్చిన‌ట్టుగా అనిపిస్తోంది క‌దూ! పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల మ‌ద్యం విక్ర‌యాలు కూడా బాగా త‌గ్గాయ‌న్న అంచ‌నాలున్నాయి. మ‌ద్యం ద్వారా వ‌చ్చే ఆదాయమే ప్ర‌భుత్వానికి ఎక్కువ క‌దా. కాబ‌ట్టి, చేతిలో డ‌బ్బుల్లేవ‌ని మందు బాబులు నిరాశ చెందాల్సిన అవ‌స‌రం లేద‌నీ, ఆన్‌లైన్ ద్వారా కొనుకోవ‌చ్చ‌ని చంద్ర‌బాబు స‌ల‌హా ఇస్తున్న‌ట్టుగా ఉంద‌ని కొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు. అయినా, ఆన్‌లైన్ విక్ర‌యాలు ఎలా చేసుకోవాలో మందుబాబుల్ని చూసి మిగ‌తావారంద‌రూ నేర్చుకోవాలా…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close