సీమాంధ్రుల ఓటు ఎటు?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగింది. ప్రతిపక్షాలను పూర్తి చీకట్లో ఉంచి, రిజర్వేషన్లు, షెడ్యూలు, నోటిఫికేషన్ ఒకేసారి ప్రకటించి, ఏడో రోజున పోలింగ్ జరిపి ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని తెరాస ప్లాన్ చేసిందని వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికల ప్రక్రియ కుదింపును తప్పు పట్టిన హైకోర్టు, ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. దీంతో సర్కార్ కు షాక్ తగిలింది. అధికార పార్టీ ఊహాలోకంలో విహరించడం మానేసి, వాస్తవం లోకి వచ్చింది.

తెరాస చాలా కాలం నుంచే ప్రచారం మొదలుపెట్టింది. హైదరాబాద్ లో ఇక వేరే పార్టీకి సందు లేనంతగా హోర్డింగు ప్రకటనలు గుప్పించింది. ఇంతకీ నగరంలోని సీమాంధ్రుల ఓటు ఎవరికి అనేది ఓ కీలకమైన విషయం. ఉద్యమ సమయంలో సీమాంధ్రులపై తీవ్రంగా విరుచుకు పడ్డ కేసీఆర్, ఆ తర్వాత చేతల్లో ఒక విధంగా, మాటల్లో ఒక విధంగా ప్రవర్తించారు.

నగరంలో నివసించే వారంతా తెలంగాణ బిడ్డలే అని కేసీఆర్ మాటల్లో చెప్తూ వచ్చారు. 1952 కు ముందు తెలంగాణలో స్థిరపడ్డ వారు మాత్రమే స్థానికులంటూ ఉత్తర్వులు ారీ చేశారు. ఇది సీమాంధ్రులకు నష్టం చేసే విషయం. ఇలా కేసీఆర్ మాటలకూ చేతలకూ పొంతన లేదని సీమాంధ్రులకు అర్థమైంది. రేపు ఎన్నికల్లో కొందరు సీమాంధ్రులకు తెరాస టికెట్లు ఇచ్చినంత మాత్రాన, ఆ ప్రాంతం వారు గంపగుత్తగా కారు గుర్తుకు ఓటేస్తారా?

పోనీ, పాత విషయం మర్చిపోదామనుకుంటే ఈ మధ్యే సీమాంధ్రులకు చెందిన లక్షల ఓట్లను తొలగించడానికి ప్రభుత్వం ప్లాన్ చేసిందనే వార్తలు కలకలం రేపాయి. ఇప్పటికే 6 లక్షలకు పైగా ఓట్లను తొలగించారంటూ ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ మొదలైంది. ఓట్ల తొలగింపు అంశం కోర్టు వరకూ వెళ్లింది. సీమాంధ్రులకు తాము అండగా ఉంటామని శశిధర్ రెడ్డి ప్రకటించారు. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీమాంధ్రులు టీడీపీకి ఓటు వేసినట్టు ఫలితాలు స్పష్టం చేశాయి. టీడీపీ అయితే తమకు అండదండగా ఉంటుందని అప్పట్లో భావించారు. బీజేపీ సైతం జాతీయ పార్టీగా సీమాంధ్రులకు బాసటగా ఉంటానని చెప్తోంది.

ఇంతకీ సీమాంధ్రుల్లో అత్యధికులు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందనేది పెద్ద చర్చనీయాంశమైంది. టీడీపీయే పెద్ద దిక్కుగా భావించి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తారని తెలుగు తమ్ముళ్లు ఆశపడుతున్నారు. ఓట్ల తొలగింపుపై పోరాడిన తమకే మద్దతిస్తారని కాంగ్రెస్ నమ్ముతోంది. అధికారంలో ఉన్నాం, కడుపున పెట్టుకుని చూసుకుంటామని ప్రకటించాం కాబట్టి కారు గుర్తుకే ఓటేస్తారని తెరాస నేతలు చెప్తున్నారు. చివరకు వీరి మద్దతును పొందే పార్టీ ఏదో తెలియాలంటే ఫిబ్రవరి 5 వరకు, అంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close