ప్ర‌భాస్ సినిమాకి మ‌ళ్లీ బ్రేక్‌

ఏ ముహూర్తాన మొద‌లెట్టారో ఏమో గానీ `జాన్‌` సినిమా షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌లా సాగుతోంది. ఈపాటికే సినిమా పూర్తి కావాల్సింది. కానీ ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. ఈ సినిమా పోగ్రెస్ ఏమిటో, ఎంత షూట్ చేశారో, ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో చిత్ర‌బృందం కూడా చెప్ప‌లేకపోతోంది. `సాహో` ఎఫెక్ట్‌తో స్క్రిప్టులో మార్పులూ చేర్పులూ చేసుకుంటూ వెళ్తున్నారు. బ‌డ్జెట్ త‌గ్గించుకోవ‌డానికి చాలా క‌స‌ర‌త్తులు చేశారు. కొన్ని ఖ‌రీదైన ఎపిసోడ్లు – తీసి, ప‌క్క‌న పెట్టేశారు. అయినా స‌రే, ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంది. ఈ సినిమా షూటింగ్‌కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. క్రిస్మ‌స్ త‌ర‌వాత కొత్త షెడ్యూలు మొద‌లుకావాల్సింది. ఇప్ప‌టి వ‌ర‌కూ అవ్వ‌లేదు. ఇప్పుడు సంక్రాంతి త‌ర‌వాతే షూటింగ్ అంటోంది చిత్ర‌బృందం. జ‌న‌వ‌రి 17 నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొద‌లుకానుంది. అన్న‌పూర్ణ స్టూడియోలో కొన్ని సెట్స్‌ని తీర్చిదిద్దారు. అక్క‌డే షూటింగ్ జ‌రుగుతుంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 2020 ద‌స‌రాకి త‌ప్ప జాన్ విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిచండం లేదు. అంత‌కంటే.. ముందుగా అంటే స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో విడుద‌ల చేస్తే గ‌నుక‌.. అది అద్భుత‌మ‌నే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close