తొలి వ‌న్డేలో.. టీమ్ ఇండియా విక్ట‌రీ

ఇంగ్లండ్ పై టెస్టు, టీ 20 సిరీస్ ని గెలుచుకున్న ఇండియా… వ‌న్డే ల్లోనూ శుభారంభం చేసింది. పూణెలో జ‌రిగిన తొలి వ‌న్డేలో 66 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగ‌న భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో.. 317 ప‌రుగులు చేసింది. ఫామ్ లో లేక తంటాలు ప‌డుతున్న థావ‌న్ (98) తృటిలో సెంచ‌రీ కోల్పోయినా… కీల‌క ఇన్నింగ్స్ ఆడి, ట‌చ్‌లోకి వ‌చ్చాడు. కోహ్లి (56), రాహుల్ (62 నాటౌట్) రాణించారు. తొలి వ‌న్డే ఆడుతున్న కృనాల్ పాండ్యా విజృంభించి ఆడ‌డంతో (31 బంతుల్లో 58) భార‌త్ భారీ స్కోరు సాధించింది.

అనంత‌రం బెన్ స్ట్రో (66 బంతుల్లో 94), రాయ్ (35 బంతుల్లో 46) తుఫాను ప్రారంభం ఇవ్వ‌డంతో ప‌రుగులు వ‌ర‌ద‌లై పారాయి. తొలి వికెట్‌కు 130 ప‌రుగుల‌కు పైగా భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. దాంతో.. ఇంగ్లండ్ ఈ టార్గెట్ ని సుల‌భంగా చేధిస్తుంద‌నిపించింది. అయితే.. ఈ ద‌శ‌లో భార‌త బౌల‌ర్లు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు తీయ‌డంతో ఇంగ్లండ్ త‌డ‌బ‌డింది. చివ‌రికి 251 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. తొలి వ‌న్డే ఆడుతున్నప్ర‌దీప్ కృష్ణ‌ 54 ప‌రుగుల‌కు 4 వికెట్ల తీసుకుని ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాశించాడు. సీనియ‌ర్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ రెండు కీల‌క‌మైన వికెట్లు తీసుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close