సీక్వెల్‌ శంక‌ర్‌… ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’

పూరితో సినిమా అంటే చ‌కాచ‌క్‌… ఫ‌టాఫ‌ట్‌. ఎప్పుడు క‌థ రాశాడో, ఎప్పుడు కొబ్బ‌రికాయ కొట్టాడో, ఎప్పుడు పూర్తి చేశాడో కూడా తెలియ‌కుండానే సినిమాని బ‌య‌ట‌కు తీసుకొచ్చేస్తాడు. ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేయ‌డం కూడా పూరికి అల‌వాటు. ఇప్పుడు రామ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే ఇస్మార్ట్ శంక‌ర్‌. దీనికి సీక్వెల్ చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చేసింది పూరికి. అనుకున్న‌దే త‌డ‌వుగా `డ‌బుల్ ఇస్మార్ట్‌` అనే టైటిల్‌కి పూరి రిజిస్ట‌ర్ చేయించేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన అవుట్ పుట్ పై అటు పూరి, ఇటు రామ్ పూర్తి సంతృప్తితో ఉన్నార‌ని, అందుకే.. అప్పుడే సీక్వెల్ కోసం స‌న్నాహాలు మొద‌లెట్టేశార‌ని టాక్‌. ఓ సినిమా విడుద‌లై, హిట్టయితే.. సీక్వెల్ గురించి ఆలోచిస్తారు. కానీ.. పూరికి అంత టైమ్ వేస్ట్ చేయ‌డం ఇష్టం ఉండ‌దు. అందుకే.. స‌గం సినిమా షూటింగ్ అవ్వ‌క‌ముందే… సీక్వెల్ ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ఇది కాన్ఫిడెన్సా?? ఓవ‌ర్ కాన్ఫిడెన్సా?? అనేది.. `శంక‌రే` తేల్చి చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close