ప‌సుపు కుంకుమ బాగా ప‌నిచేసింద‌న్న జేసీ!

మాన‌వుడి జ్ఞాప‌క శ‌క్తికి ఫ్రెష్ గా ఉండేదాని గురించే గుర్తుంటుందిగానీ, గ‌తాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ర‌చిపోతూ ఉంటుంద‌న్నారు టీడీపీ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి. ఏ పూట‌ది ఆ పూట మాత్ర‌మే గుర్తుంటుంద‌నీ, ఇప్పుడు తింటే ఇంకాసేపు వ‌ర‌కూ మాత్ర‌మే గుర్తుంటుంద‌ని అన్నారు. ఓ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… ఐదేళ్ల వ‌ర‌కూ చేసిన‌వ‌న్నీ ఒకెత్తు, ఎన్నిక‌ల‌కు కొద్దిరోజులు ముందు చేసింది మ‌రో ఎత్తు అనీ, దాన్ని మాత్ర‌మే ప్ర‌జ‌లు గుర్తుపెట్టుకుంటార‌ని వ్యాఖ్యానించారు! ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో తానో మాట చెప్పాన‌నీ… నీ అంత అదృష్ట‌వంతుడు మ‌రొక‌డు లేడ‌న్నాన‌ని జేసీ చెప్పారు. మూడు మాసాలు ముందు నువ్వు క‌ల‌గ‌న‌లేద‌నీ, ఏప్రిల్ 11న ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అనుకోలేద‌న్నాని చెప్పారు. ఆలోపుగానే, అంటే ఐదో తేదీని ప‌సుపు కుంకుమ, తొమ్మిదో తేదీన రైతుల‌కు చెక్కులు ఇచ్చార‌నీ… ఇవి స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు వెళ్తాయ‌ని క‌ల‌గ‌న‌లేద‌ని చంద్ర‌బాబుతో చెప్పాన‌న్నారు.

ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి, పెళ్లిళ్ల‌కు సాయం, వైద్య స‌హాయం, న‌దులు అనుసంధానం లాంటి ఎన్నో కార్య‌క్ర‌మాలు చంద్రబాబు చేశార‌నీ, కానీ వీటిని మెచ్చుకునేది కొద్దిమంది మాత్ర‌మే అని చంద్ర‌బాబుతో తాను చెప్పాన‌న్నారు. ఇంత చేస్తున్నా అయితే ఏంటి అన్న‌ట్టుగానే చాలామంది అనుకుంటున్నార‌ని చెప్పాన‌న్నారు. ఐదేళ్లుగా చేసిన‌వ‌న్నీ ఒకెత్తు అయితే, ప‌దివేల రూపాయ‌ల ప‌సుపు కుంకుమ‌, రైతుల‌కు ఇచ్చిన ఆర్థిక సాయం ఎన్నిక‌ల్లో బాగా ప‌నిచేశాయ‌న్నారు. ఇది పార్టీల‌కు అతీతంగా ఓట‌రు మ‌న‌స్థ‌త్వాన్ని గురించి త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయంగా చెబుతున్న‌ద‌ని జేసీ అన్నారు. ఎన్నిక‌లు అత్యంత ఖ‌రీదైన‌వి అయిపోయాయ‌నీ, డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే నిల‌దీసి అడుగుతున్న‌వారిని తాను చూశాన‌న్నారు. ఈ పరిస్థితికి ప్ర‌జ‌ల‌నొక్క‌రినే త‌ప్పుబ‌ట్ట‌లేమ‌నీ, నాయ‌కులు, అధికారులు అంద‌రూ బాధ్యులే అన్నారు. ఎన్నిక‌ల వ్య‌యాన్ని త‌గ్గించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే అవినీతి సంపాద‌న పెరుగుతోంద‌న్నారు. ఒక‌వేళ ఎన్నిక‌ల వ్య‌యాన్ని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగితే, అడ్డ‌గోలుగా సంపాదించాల్సిన ప‌ని నాయ‌కుల‌కీ ఉండ‌ద‌న్నారు జేసీ.

జ‌గ‌న్ సీఎం అవుతాడ‌న్న ధీమా వైకాపా వాళ్ల‌కి ఉంటే ఉండొచ్చుగానీ, ఈ రాష్ట్రానికి చంద్ర‌బాబు నాయుడి అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు జేసీ. ఆయ‌నే మ‌రోసారి ముఖ్య‌మంత్రి కాబోతున్నార‌న్నారు. త‌న‌కీ కులాభిమానం ఉందిగానీ, రాష్ట్ర అవ‌స‌రాల దృష్ట్యా ఆలోచిస్తే చంద్ర‌బాబు నాయుడే క‌రెక్ట్ అని తాను న‌మ్ముతా అన్నారు. జేసీ వ్యాఖ్య‌ల‌పై కొన్ని విమ‌ర్శ‌లు త‌ప్పేట్టుగా లేవు. ఎందుకంటే, ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం త‌క్ష‌ణ లాభాల‌ను గుర్తుపెట్టుకునేట్టుగా మాత్ర‌మే ఉంటుంద‌న్నారు. ఇక‌, జేసీ ప్ర‌స్థావించిన ఇత‌ర‌ అంశాలు కొంత ఆలోచ‌నాత్మ‌కంగానే ఉన్నాయ‌నీ చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close