పాక్ ఉగ్రవాదులను పట్టుకోవడానికి అమెరికా సహాయపడుతుందిట!

ఒక్కోసారి అమెరికా కూడా గొప్ప జోకులు వేస్తుంటుంది. అటువంటిదే ఈ జోక్ కూడా. అమెరికా స్టేట్ డిపార్టమెంట్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా “భారత్ పై దాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులను పట్టుకొని వారిపై చర్యలు చేపట్టేందుకు భారత్ కి సహాయపడేందుకు అమెరికా సిద్దంగా ఉంది. ఈ విషయంలో భారత్ కి సహాయపడటం ఆదేశంతో మా స్నేహసంబంధాలకు నిదర్శనంగా నిలుస్తుంది,” అని చెప్పారు.

అమెరికాపై ఉగ్రవాదులు దాడులు జరిపితే అది ప్రపంచ శాంతికి భంగం కలిగినట్లు చెప్పుకొని ఆ ఉగ్రవాదులు వేరే ఏ దేశంలో దాగిఉన్నా ఆ దేశంలోకి జొరబడి వారిపై తన విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తుంటుంది. అదే గత మూడు,నాలుగు దశాబ్దాలు పాక్ ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేసి వేలాది మందిని బలిగొంటున్నా ఏనాడూ అమెరికా భారత్ పై సానుభూతి చూపలేదు. సహాయపడేందుకు ముందుకు రాలేదు. పైగా ఉగ్రవాద నిర్మూలన పేరుతో పాకిస్తాన్ కి ప్రతీ ఏటా వందల కోట్ల డాలర్లు కప్పంగా చెల్లిస్తోంది. పాక్ ప్రభుత్వం ఆ డబ్బు ఉగ్రవాద నిర్మూలనకే వినియోగించి ఉండి ఉంటే, ఆ దేశంలో ఏనాడో ఉగ్రవాదులు నాశనం అయ్యేవారు. కానీ నేటికీ మసూద్ అజ్హర్, లక్వీ, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వ రక్షణలోనే నిర్భయంగా తిరుగుతున్నారు.

పఠాన్ కోట్ దాడికి కుట్రపన్నిన మసూద్ అజ్హర్, మళ్ళీ భారత్ పై దాడులు చేస్తామని హెచ్చరిస్తుంటే, అతను నిర్దోషి అని పాక్ ప్రభుత్వం అతనిని వెనకేసుకు వస్తోంది. కనుక ఇప్పుడు అమెరికా అడిగినంత మాత్రాన్న పాక్ ప్రభుత్వం అతనిని భారత్ కి అప్పగించేస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. అలాగే పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిష్టవేసుకొని ఉన్న ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తే అమెరికా సహాయ పడుతుందని ఆశించడం అత్యాసే అవుతుంది.

తనకు లాభం లేనిదే అమెరికా ఏ పని చేయదు. కనుక పాక్ ఉగ్రవాదులను పట్టుకోవడానికి భారత్ కి సహకరించదలిస్తే దానికీ ఏదో బలమయిన కారణమే తప్పక ఉంటుంది. బహుశః భారత్ లో ఏదో పెద్ద ప్రాజెక్టు దక్కించుకోవడం కోసమే అమెరికా ఈ ఎర వేసి ఉండవచ్చును లేదా అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అమెరికాలో స్థిరపడిన భారతీయులను ఆకట్టుకోవడానికి అయ్యుండవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close