ప‌వ‌న్ రేంజు.. రెండు రూపాయ‌లే

ప‌వ‌న్ క‌ల్యాణ్ అన‌గానే విరుచుకుప‌డిపోయే క‌మాల్ ఖాన్ మ‌రోసారి ప‌వ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకి ముంబైలో థియేట‌ర్‌లో ప‌ది మంది కూడా క‌నిపించ‌ర‌ని, అలా క‌నిపిస్తే… తెలుగు రాష్ట్ర్రాల్లో న‌గ్నంగా తిరుగుతాన‌ని ప్ర‌క‌టించిన క‌మాల్ ఖాన్‌.. ఇప్పుడు మ‌రింతగా రెచ్చిపోతున్నాడు. తెలుగులోనే కాదు, బాలీవుడ్‌లో కూడా స‌ర్దార్ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అని రివ్యూలో చెబుతున్నాయ‌ని, ప‌వ‌న్ కెరీర్‌లో ఇది నెం.1 ఫ్లాప్ చిత్ర‌మ‌ని తీర్మాణించేశాడు క‌మాల్ ఖాన్‌.

అక్క‌డితే ఆగ‌లేదు. ‘పవన్ కళ్యాణ్ సార్, మీ సర్దార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ఫ్లాప్, మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్. కాబట్టి నా దేశ్ ద్రోహి 2 సినిమాలో నటించి తిరిగి సూపర్ స్టార్ గా ఎదగండి’ అంటూ కామెంట్ చేశాడు. అయితే క‌మాల్ ఖాన్‌ని ఈసారి కెలికిందీ రాంగోపాల్ వ‌ర్మ‌నే. స‌ర్దార్ సినిమాపై నీ అభిప్రాయం చెప్ప‌మంటూ క‌మ‌ల్‌ఖాన్‌కి రీ ట్వీట్ చేశాడు. ఈయ‌నేమో.. ఇలా రెచ్చిపోయాడు. చూస్తుంటే వ‌ర్మ‌. క‌మాల్ ఖాన్‌లు ఇద్ద‌రూ క‌లిసి ప‌వ‌న్ ఇమేజ్ డామేజ్ చేయ‌డానికి చేస్తున్న ట్వీట్ల నాట‌కంలా ఉంది ఈ ఎపిసోడ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close