అంద‌రూ క‌లిసి ‘ప‌ద్మ‌శ్రీ‌’పై ప‌డ్డారేంటి

కంగ‌నా నోరు తెరిస్తేచాలు.. దాని చుట్టూ వంద వివాదాలు. తాజాగా దేశ స్వాతంత్ర్యం కోసం కంగ‌నా చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 1947లో దేశానికి వ‌చ్చింది నిజ‌మైన స్వాతంత్య్రం కాద‌ని, అది భిక్ష మాత్ర‌మే అని, 2014లోనే దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ట్టు లెక్క అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కంగ‌నా. ఇంకే ముంది? బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌న్నీ ఏక‌మైపోయాయి. కంగ‌న‌నా దేశ ద్రోహిగా చిత్రీక‌రించ‌డం మొద‌లెట్టాయి. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి, ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది త్యాగ మూర్తుల‌ను కంగ‌నా అవ‌మానించింద‌ని, కంగ‌నాని అరెస్ట్ చేయాల‌ని, ఆమెకు ఇచ్చిన ప‌ద్మ‌శ్రీని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని ర‌క‌ర‌కాల డిమాండ్లు.

కంగ‌నా ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకుంది. రెండు రోజులు అయ్యిందో లేదో.. ఆమె చేతి నుంచి ప‌ద్మ‌శ్రీ జారిపోయేలా ఉంది. దానికికార‌ణం.. ప‌క్కాగా మ‌ళ్లీ కంగ‌నానే. దేశ స్వాతంత్ర్యం కోసం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి, ఇప్ప‌టికీ దానికే క‌ట్టుబ‌డిఉంటానంటోంది కంగ‌నా. ఇవ‌న్నీ ప‌క్కా బీజేపీ ఫేవ‌ర్ కామెంట్ల‌న్న‌ది అంద‌రికీ తెలుసు. దేశంలో మోడీ మంత్రం ఇంకా బ‌లంగా వినిపించ‌డానికి, మోడీ – బీజేపీ త‌ప్ప ఈ దేశాన్ని పాలించ‌డానికి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని చెప్పుకోవ‌డానికి అప్పుడ‌ప్పుడు కంగ‌న లాంటి వాళ్ల‌తో పాచిక‌లు వేయించ‌డం అల‌వాటైన విష‌య‌మే. కంగ‌నా ఈ మ‌ధ్య కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి, బీజేపీ మైలేజీ పెంచ‌డానికి వీలైనంత వ‌రకూప్ర‌య‌త్నించింది. అందుకే ఆమెకు ప‌ద్మ‌శ్రీ కూడా వ‌చ్చింద‌ని బ‌య‌ట టాకు. ప‌ద్మ‌శ్రీ ఇలా అందుకుందో లేదో, అప్పుడే.. త‌న వ్యాఖ్య‌ల డోసు పెంచేసింది కంగ‌నా. ఇప్పుడు కూడా `నేనేమాత్రం త‌ప్పు మాట్లాడ‌లేదు. నా మొత్తం వీడియోలో మీరే ఎడిట్ చేసి, ఎలా కావాల‌నుకుంటే అల వాడుకుంటున్నారు. నా వ్యాఖ్య‌ల‌లో త‌ప్పు ఉంద‌ని ఎవ‌రైనా నిరూపిస్తే.. నా ప‌ద్మ‌శ్రీ వెన‌క్కి ఇచ్చేస్తా` అంటోంది కంగ‌నా. ఇప్పుడు శివ‌సేన నాయ‌కులు కంగ‌నా వ్యాఖ్య‌ల్లో దేశ ద్రోహం ఎంతుంది? అనే విష‌యాలపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా.. కంగ‌నాకొచ్చిన ప‌ద్మ‌శ్రీని లాగేయాల‌న్న‌ది బీజేపీ ఇత‌రుల కిం క‌ర్త‌వ్వంగా మారింది. మ‌రి ఇది ఎన్నాళ్ల ముచ్చ‌టో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close