తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అంతా కవిత గురించే చర్చ జరుగుతోంది. ఇప్పుడే కాదు.. గత కొన్ని నెలలుగా జరుగుతోంది. ఇప్పుడు మరింత ఎక్కువగా జరుగుతోంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు కవిత కాంగ్రెస్ రంగలు ఉన్న చీరతో వెళ్లారు. అంతే కొంత మంది గగ్గోలు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన వారు ఎవరో కాదు బీఆర్ఎస్ కార్యకర్తలే. కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారితో జత కలిశారు.
కవిత కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని కొంత మంది ప్రచారం చేసేస్తున్నారు. ఇలా చేస్తారని తెలిసే కవిత ఆ రంగుల చీర కట్టుకుని వచ్చారు. ఆమెపై ఏదో ఓ నెగెటివ్ ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా రెడీగా ఉంటుంది. ఆ విషయం తెలిసే కవిత అలా గేమ్ ఆడుతున్నారు. అంతకు ముందే కవిత.. అదే చీర కట్టుకుని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై మోసం చేశారని.. కాంగ్రెస్ గద్దెలు కూల్చాలని అన్నారు. తర్వాత వేడుకకు వెళ్లారు.
బీఆర్ఎస్ నేతలపై కవిత చేసే విమర్శలు కేవలం అటెన్షన్ కోసమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. కానీ అలాంటి అటెన్షన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీనే ఇస్తుంది. ఆమె కాంగ్రెస్ కు దగ్గరవుతుందని చెప్పేందుకు విపరీతంగా ప్రచారం కల్పించారు. కానీ కవిత రాజకీయ వ్యూహం ఏమిటో మాత్రం వారికి తెలియదు. ఇప్పటికి అయితే బీఆర్ఎస్ సోషల్‌మీడియాను ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా ఉండటంలో మాత్రం ఆమె అనుకున్నది సాధిస్తున్నారు.