మహాకూటమిలో ఓట్ల బదిలీ జరగదట..! కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రెడీ..!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం నామినేషన్ల వరకూ వచ్చింది. ఓ వైపు అధికార పార్టీ.. మరో వైపు కూటమిగా విపక్షాలు హోరాహోరీ తలపడుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు … ఎన్నికలు ఏకపక్షమేనన్న ప్రచారం జరింది. టీఆర్ఎస్ ఓడించే ప్రత్యామ్నాయం లేదన్న భావన అప్పటి వరకూ రాజకీయవర్గాల్లో ఉంది. అయితే.. ఎప్పుడైతే.. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కూటమిగా ఎర్పడ్డాయో… అప్పుటి నుంచే రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందేనే అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది.

వ్యతిరేక ఓట్లన్నీ సమీకృతం అయ్యాయా..?

తెలంగాణలో రాజకీయ పరిస్థితి కారణంగా ఓట్ల పోలరైజేషన్ జరిగుతుందనే అభిప్రాయం ఏర్పడింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కావాలని అనుకునేవాళ్లందరూ.. మహాకూటమి వైపే చూస్తారని… ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంతా కన్సాలిడేట్ అవుతుందన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. బీఎల్ఎఫ్, బీజేపీ బరిలో ఉన్నా… టీఆర్ఎస్, మహకూటమి ముఖాముఖి పోటీ పడుతున్నట్లే. ఓటర్లు కూడా… టీఆర్ఎస్ నా.. ప్రత్యామ్నాయమా అన్న పద్దతిలో ఓటింగ్ ప్రయారిటీని నిర్ణయించుకునే వాతావరణం ఏర్పిడింది. ఓ రకంగా ఇది… తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందికర పరిణామమే. అందుకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… కూటమిపై ప్రయోగించడానికి విభిన్న వ్యూహాలను సిద్దం చేశారు. అందులో మొదటిది.. అభ్యర్థులతో అమలు చేస్తున్నారు. అసలు అభ్యర్థులెవరన్నది ఆలోచించకుండా… టీఆర్ఎస్ సంక్షేమ ఎజెండాను ప్రజల ముందుకు తీసుకెళ్లి .. తీర్పు పొందాలని.. ఆదేశించారు. ఆ ప్రకారం .. అభ్యర్థులు తమ పని తాము చేసుకుంటున్నారు.

కూటమి ఓట్లు కన్సాలిడేట్ కాకుండా కేసీఆర్ ఏం చేస్తున్నారు..?

కేసీఆర్ మొత్తం అభ్యర్థులపైనే వదిలి పెట్టలేదు. పార్టీ పరంగా… కొంత మంది ఇన్చార్జులను నియమించి ప్రత్యేకంగా అమలు చేయాల్సిన వ్యూహాలు ఖరారు చేశారని చెబుతున్నారు. అందులో మొదటిది.. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగకుండా చూడటం. మహాకూటమి విజయవంతం అవ్వాలంటే.. ఆయా పార్టీల తరపున అభ్యర్థులుగా నిలబడిన వారికి అన్నిపార్టీల నేతలూ సహకరించాలి. క్యాడర్ తో ఓట్లు వేయించాలి. అలా చేయకపోతే…కూటమి ప్రయోజనం నెరవేరదు. అందుకే ఓట్ల బదిలీ జరగకుండా చూసేందుకు కేసీఆర్ … కొన్ని ప్రత్యేకమైన ప్లాన్లు రెడీ చేశారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. దీనికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్లాన్లు రెడీ అయ్యాయనంటున్నారు. మహాకూటమి సక్సెస్ కాకుండా… చూసేందుకు.. కేసీఆర్ అమలు చేస్తున్న మరో ప్లాన్… నేతల వలసలు. మహాకూటమికి అతి పెద్ద ముప్పు నేతల అసంతృప్తులే.

ప్రాయోజిత రెబల్స్ వ్యూహం ఎంత బలంగా ఉంది..?

కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నుంచి… టిక్కెట్లు ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అందరికీ అకామిడేట్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి వారిలోచాలా మంది ఫలితాల్నని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. ఇలాంటి వారినందర్నీ గుర్తించి … టీఆర్ఎస్ ఆకర్షించనుంది. అయితే అందర్నీ.. ఇప్పటికిప్పుడు పార్టీలో చేర్చుకోవడం కన్నా.. వారిని రెండు విధాలుగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. నేరుగా ఓట్ల పరంగా లాభం కలిగించే నేతలైతే.. పార్టీలో చేర్చుకుంటారు. అదే సమయంలో… రెబల్ గా పోటీ చేసి మహాకూటమి అభ్యర్థికి నష్టం చేకూర్చగలిగే స్థాయిలో … ఆ విధంగా ఉపయోగించుకునేందుకు వ్యూహం సిద్దం చేశారు. గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే.. కొంత మంద నేతలను గుర్తించారు. వారిలో కూటమి జాబితా ప్రకటన తర్వాత… అసంతృప్తికి గురైన వారిని రెబల్ గా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వనరులకు కొరత లేకపోవడంతో… టీఆర్ఎస్ ఈ వ్యూహంలో సులువుగా సక్సెస్ అవుతుందని అంటున్నారు. చివరిగా.. కాంగ్రెస్ ఎవరినైనా బలహీన అభ్యర్థుల్ని నిలిపితే.. వాళ్లను సులువుగా డమ్మీలను చేసే ప్లాన్లు కూడా రెడీగా ఉన్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close