ఫెడరల్ ఫ్రంట్ కోసం ఎన్డీఏ మిత్రపక్షాలతో మాట్లాడే ధైర్యం కేసీఆర్ చేయగలడా?

ఒక ఏడాది కిందట కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడటం మొదలెట్టారు. కాంగ్రెస్ బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాలను శాసిస్తాయని, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బిజెపిలు ఇద్దరిలో ఎవరికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ రాదని బలంగా వాదించారు. అంతేకాకుండా యూపీఏ కూటమి, ఎన్డీయే కూటమి కూడా మెజారిటీ సాధించలేవని, తటస్థంగా ఉండే ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే సమయం ఆసన్నమైందని కేసీఆర్ అన్నారు. అయితే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట చేసిన హడావుడి అంతా మోడీ కు సహాయం చేయడానికే అంటూ మొదటి నుండి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చే సమయం దగ్గర పడుతున్నప్పటికీ కెసిఆర్, ఈ విమర్శను తిప్పికొట్ట లేకపోతున్నాడు.

కేవలం యూపీఏ మద్దతుదారులను మాత్రమే కలుస్తున్న కేసీఆర్:

ఇటీవల కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అవబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. అలాగే కేరళ సీఎం విజయన్ ని కూడా కేసీఆర్ కలిశారు. అలాగే యుపిఎకు మద్దతు దారులుగా ఉన్నటువంటి, మోడీని వ్యతిరేకిస్తున్నటువంటి మమతాబెనర్జీ తదితరులతో కేసీఆర్ ఫ్రంట్ ప్రతిపాదన తీసుకువస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కుమారస్వామికి కూడా కేసీఆర్ ఫోన్ చేశారు. అయితే యూపీఏ కూటమికి నేరుగా గాని పరోక్షంగా గాని మద్దతు ఇస్తున్న పార్టీలను అందులోనుంచి బయటకు లాగడానికి మాత్రమే కేసిఆర్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది తప్ప ఎన్డీఏ కూటమి లో ఉన్నటువంటి పక్షాలైన శివసేన, శిరోమణి అకాలీదళ్, అన్నాడీఎంకే లాంటి వాళ్ళ జోలికి కూడా కేసీఆర్ వెళ్లే ప్రయత్నం చేయడం లేదు అని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.

మోడీకి వ్యతిరేకంగా వెళ్లే సాహసం కెసిఆర్ చేయలేడా?

ఇవన్నీ చూస్తుంటే, ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసిఆర్ చేస్తున్న హడావుడి అంతా కేవలం మోడీ కి దొడ్డిదారిన సహాయం చేయడానికేనని కొందరు విమర్శిస్తున్నారు. నిజానికి కేసీఆర్ ఫ్రంట్ ప్రతిపాదనను వచ్చిన కొత్తలోనే ఇది మోడీ ప్లాన్ బి అని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ కారణం వల్లే, కేవలం యూపీఏ మిత్ర పక్షాలని మాత్రమే కెసిఆర్ కలుస్తున్నారని, కెసిఆర్ కి నిజంగా ఫెడరల్ ఫ్రంట్ పైన చిత్తశుద్ధి ఉంటే బిజెపి మిత్రపక్షాలైన పార్టీలను కూడా కెసిఆర్ కలవాలని, వారిని ఎన్డీఏ నుంచి వేరు చేయడానికి ప్రయత్నించే సాహసం చేయాలని, ఒకవేళ కేసీఆర్ అలా చేసినట్లయితే అప్పుడు కేసీఆర్ నిజంగానే మోడీకి వ్యతిరేకంగా వెళ్తున్నాడని అర్థం చేసుకోవచ్చని కెసిఆర్ విమర్శకులు అంటున్నారు.

యూపీఏ అధికారంలోకి వస్తే తన రాజకీయ భవిష్యత్తు కే ప్రమాదం అని కేసీఆర్ భావిస్తున్నారా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ సోనియా గాంధీని దేవతగా అంటూ కీర్తించారు. తెలంగాణ గనక ప్రకటిస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తాం అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన తర్వాత కెసిఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాగాంధీతో భేటీ అయి వచ్చారు. అయితే ఆఖరి నిమిషం లో విలీనం చేస్తానని తాను కాంగ్రెస్ కు ఇచ్చిన మాటను తప్పి కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చారు. అయితే రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తన సొంత ప్రయోజనాలను చూసుకుంటుంది కాబట్టి ఇందులో పెద్దగా తప్పు పట్టడానికి ఏమీ లేదు. అయితే ఇప్పుడు కేంద్రంలో గనక యూపీఏ కూటమి అధికారంలోకి వస్తే, తాను ఐదేళ్ల కిందట కాంగ్రెస్ కు ఇచ్చిన ఝలక్ కారణంగా కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకుంటుందేమోనన్న భయం కెసిఆర్ లో ఉన్నట్టు కొంతమంది భావిస్తున్నారు. అందుకే వీలైనంతవరకు యూపీఏ కేంద్రంలో అధికారంలోకి రాకుండా తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడని అంటున్నారు.

ఏదిఏమైనా ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే కేసీఆర్ మోడీకి ఇబ్బంది కలిగించే పని చేసే అవకాశం లేదని అనిపిస్తోంది. మరి ఈ ఫెడరల్ ఫ్రంట్ నిజంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందా లేక ఫలితాలు వచ్చాక చప్పబడుతుందా అన్నది తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close