కాంగ్రెస్ గెలిస్తే ? – కేసీఆర్ నోటి వెంట తరచూ ఇదే మాట !

రాజకీయాల్లో పక్క పార్టీ గెలిస్తే అనే మాట తమ నోటి వెంట రాకూడదని రాజకీయ పార్టీల నేతలు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి కేసీఆర్ అదే డైలాగ్ ను పదే పదే వాడుతున్నారు. రోజుకు మూడు బహిరంగసభల్లో మాట్లాడుతున్న ఆయన… కాంగ్రెస్ గెలిస్తే అని పదే పదే అంటున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందా… అన్న పరిస్థితి ఉందేమోనని కేసీఆర్ ప్రసంగాలు చూసిన వారికి అనిపిస్తుంది.. కాంగ్రెస్ గెలిస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుందని ప్రజల్ని భయపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం ఆయన నేరుగా కాంగ్రెస్ గెలిస్తే అనే పదం వాడేస్తున్నారు.

కాంగ్రెస్ నేతలు సూపర్ కాన్ఫిడెంట్ గా… ఉన్నారు. మరోసారి బీఆర్ఎస్ సర్కార్ రాదని.. గెలిచే చాన్సే లేదని చెబుతున్నారు. పదేళ్ల వైఫల్యాలు.. .. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం వంటి వాటిపై ప్రచారం చేస్తున్నారు. అవినీతి… అక్రమాలపై మాట్లాడుతున్నారు. రాగానే చర్యలు తీసుకుంటామంటున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో… బీఆర్ఎస్ కు హోప్స్ ఉన్నాయన్న అభిప్రాయం కల్పించడం లేదు. కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం… కాంగ్రెస్ వస్తే అంటూ మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా అంతే.

కేసీఆర్, కేటీఆర్ మాటలతో… కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని అంగీకరించినట్లయిందని… కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకుంటున్న వారిని.. ఆ పార్టీ వస్తే ఏదో జరిగిపోతుందని భయ పెట్టి ఓటు వేయకుండా చేయాలన్న వ్యూహం అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో.. పదేళ్ల అధికార వ్యతిరేకత ఉన్న సమయంలో… ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఇతర పార్టీల గెలుపు గురించి పదే పదే మాట్లాడటం … ఆ పార్టీకి మేలు చేసినట్లవుతుందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాళ్లందర్నీ మళ్లీ సాక్షిలోకి తీసుకోవట్లేదు !

ఐదేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో సాక్షిలో పని చేసిన వాళ్లే ఎక్కువగా చేరారు. ఫోటో గ్రాఫర్ల దగ్గర నుంచి సలహాదారు, పీఆర్వోల వరకూ అందరూ సాక్షిలో...

ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్ పై కసరత్తు

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈ హామీని...

కొడాలి నాని ఇప్పుడు సుప్పిని..సుద్దపూస కూడా!

కొడాలి నాని నోరు తెరిస్తే లుచ్చా భాష మాట్లాడతారు. ప్రతి పదానికి ముందూ వెనుకా బూతులుంటాయి. ఇలాంటి భాష ఇప్పుడు మెరుగుపడింది. ఓడిన తర్వాత తొలి సారి మీడియా ముందుకు వచ్చిన ...

రైల్వే ట్రాఫిక్ రెడ్డి చేసిన భారీ లిక్కర్ స్కాం !

ఏపీలో జగన్మోహన్ రెడ్డి కేర్ టేకర్ సీఎంగా ఉండగానే ఆయన ప్రభుత్వంలోని అవినీతి పుట్ట బద్దలవుతోంది. ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారాన్ని గుప్పిట పట్టిన వాసుదేవరెడ్డి అనే అధికారి ఫైళ్లు దొంగతనం చేసి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close