అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ నజర్..!

తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 7నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలకు ఏర్పాటు చేసి.. కనీసం ఇరవై రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. సిద్ధం కావాలని మంత్రులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి. అయితే ిప్పుడు.. అన్‌లాక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. వచ్చే నెల మొదటికి పూర్తిగా అన్‌లాక్ చేసే అవకాశం ఉంది. దీంతో ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సాధారణంగా వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌లోనే నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువ రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. పార్లమెంట్ సమావేశాలు కూడా అదే సమయంలో అటూ ఇటూగా జరుగుతూ ఉంటాయి. కరోనా అయినా.. మరో కారణం అయినా… వీటిని ఆపడానికి అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పద్దతుల్నైనా ఎంచుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే.. కోవిడ్ నిబంధనల ప్రకారం… భౌతిక దూరం పాటిస్తూ.. సీటింగ్ ఏర్పాటు చేసి.. సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమయింది. ఇప్పుడు కేసీఆర్ కూడా.. ఏడో తేదీన ముహుర్తం పెట్టుకున్నారు.

ఏపీ ప్రభుత్వం కూడా.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఎప్పటి నుంచి నిర్వహించాలన్నదానిపై ఎలాంటి ఆలోచనలు ఇంకా వెల్లడించలేదు. కరోనా కారణంగా.. భౌతిక దూరం పాటిస్తూ.. నిర్వహించాల్సిన సమావేశాల కోసం.. చాలా ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. మరి ఏపీ సర్కార్ ఆలోచనలు ఎలా ఉన్నాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close