రాహుల్ గాంధీ ఓ పెద్ద బఫూన్..! కంట్రోల్ తప్పిన కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వాక్చాతుర్యం గురించి అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో ఆయన నోటి నుంచి ఇతరులను కించ పరుస్తూ వచ్చే మాటల గురించి అంతే వ్యతిరేకంగా చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఆయన అత్యంత అసభ్యంగా విమర్శించేవారు. ఆ సమయంలో అది గడిచిపోయింది. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్, ఆగ్రహం… కేసీఆర్ తిట్లలో ప్రతిఫలించేవని సరిపెట్టుకున్నారు. కానీ కేసీఆర్ ఇప్పటికీ.. అవే తిట్లు కొనసాగిస్తున్నారు. ఈ సారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే తన ఘాటు వ్యాఖ్యలను గురి పెట్టారు. రాహుల్‌ గాంధీని ఓ “పెద్ద బఫూన్” అని ఓ చిన్న స్థాయి నేతని విమర్శించినట్లు విమర్శించేశారు. ఈ వ్యాఖ్యలు విని అక్కడున్న జర్నలిస్టులంతా నవ్వుకున్నారు. టీఆర్ఎస్, బీజేపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో చెప్పుకుని ఆనందం పొందారు. బీజేపీ అనుకూల జాతీయ మీడియా కూడా.. గొప్పగానే ప్రసారం చేసుకుంది.

కేసీఆర్ తిట్లు .. కొంత మందికి ఆనందం కలిగించవచ్చేమో కానీ.. అవి రాజకీయాల్లో హుందాతనాన్ని పెంచేవి కావు. గతంలో కేసీఆర్ చేసిన విమర్శలపై… కాంగ్రెస్ నేతలు అంతకంటే ఘాటుగానే స్పందించారు. రాజకీయాల్లో “తమలపాకుతో ఒకటంటే.. నేను తలుపు చెక్కతో రెండు అంటా” అన్న స్థాయిలో నేతలు స్పందిస్తూ ఉంటారు. ఒకరు బూతులు మాట్లాడితే.. మరోకరు.. అంతకంటే బూతులు మాట్లాడతారు. అంత ఎందుకు… కేసీఆర్‌పై ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా.. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎవరూ వినలేరు. ఒకప్పుడు.. రేవంత్ రెడ్డి మాటలను మీడియా కూడా ప్రసారం చేసేది. కానీ కేసీఆర్‌ గ్రిప్‌లోకి మీడియా వెళ్లిన తర్వాత రేవంత్ మాటలు బయటకు రావడం లేదు కానీ… రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కన్నా ఎక్కువగా ఆయనను.. విమర్శిస్తూంటారు. “తాగుబోతు” లాంటి పదాలను.. అసువుగా వాడేస్తూంటారు. ఇలాంటివన్నీ చర్యకు ప్రతి చర్య అన్నట్లుగానే ఉంటాయి. మొదటి చర్యను కేసీఆరే ప్రారంభించి మిగతా వారికి అవకాశం ఇస్తున్నారు.

ఇలాంటి వివాదాల వల్ల ప్రజలకు వచ్చే మేలు కానీ.. వారి సమస్యలు చర్చకు వచ్చే అవకాశం కానీ ఉండదు..? అదో పనికి రాని వివాదంలో ప్రజల్లో నానుతుంది. రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా.. అని చర్చించుకోవడానికి తప్పా…. ఆ వివాదం ఎందుకూ పనికి రాదు. నిజానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు తెలంగాణ వాదుల్లో ప్రజల్లో సానుభూతి ఉంది. ఏపీలో పార్టీని పూర్తిగా నాశనం చేసుకున్నా… తెలంగాణలో అధికారం అందుకోలేకపోయారని ప్రజలు బావిస్తున్నారు. ఆ మేరకు..సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ప్రజల్లో ఆదరణ ఉంది. అయినా కేసీఆర్.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి అధ్యక్షుడన్న గౌరవం కూడా ఇవ్వకుండా.. “పెద్ద బఫూన్” అనేయడం విమర్శలకు తావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close