స్టూడెంట్స్‌తో పెట్టుకోవద్దు: కేజ్రీవాల్ వార్నింగ్

హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న హెచ్‌సీయూ విద్యార్థులను కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. తర్వాత వారినుద్దేశించి ప్రసంగిస్తూ భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులపై పోరు సాగిస్తోందని అన్నారు. విద్యార్థులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. యువకులు, విద్యార్థులు తిరగబడితే కేంద్రంలో బీజేపీ పీఠం కూలిపోతుందని అన్నారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పీఠాలపై ఆర్ఎస్ఎస్ భావజాలమున్నవారిని కూర్చోబెడుతున్నారని ఆరోపించారు. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా గజేంద్ర చౌహాన్ అనే అనర్హుడిని కూర్చోబెట్టారని, దానికి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాలు చర్చకు వేదికలని అన్నారు. ఇక్కడ చర్చించే స్వేచ్ఛను అణగదొక్కితే అనర్థమని చెప్పారు. కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని రోహిత్ ఆత్మహత్యపై అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ఘటనను పక్కదోవ పట్టించటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రోహిత్ లాంటి ప్రతిభావంతుడైన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం దేశానికి సిగ్గుచేటని అన్నారు. సుశీల్ అనే విద్యార్థిపై దాడి జరిగిందనటం అవాస్తవమని చెప్పారు. సుశీల్‌కు రక్షణ కావాలని అతని తల్లి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ అఫిడవిట్ దాఖలు చేశారని, దానిలో సుశీల్‌పై దాడి జరగలేదని స్పష్టంగా పేర్కొన్నారని కేజ్రీవాల్ అన్నారు. విద్యార్థుల సస్పెన్షన్‌పై తాను వీసీతో మాట్లాడదామని అనుకున్నామని, అయితే సమస్య తమ సస్పెన్షన్ కాదని, వీసీని తొలగించటమే తమ ప్రధాన డిమాండ్ అంటూ విద్యార్థులు వారించారని చెప్పారు. వీసీని తక్షణమే తొలగించాలనిడిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు తాను అండగా ఉంటానని చెప్పారు. కేజ్రీవాల్ జై భీమ్ అని, రోహిత్ అమర్ రహే అని నినాదాలు కేజ్రీవాల్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close