ఏపీ లిక్కర్ స్కామ్ లో కేశినేని చిన్ని హస్తం ఉందని బిగ్ బాంబ్ పేల్చిన మాజీ ఎంపీ నాని వ్యాఖ్యల వెనక వైసీపీ ఉందా? ఈ కేసు బిగ్ బాస్ మెడకు చుట్టుకోనుందనే డైవర్షన్ రాజకీయాలు ప్రారంభించిందా? ఇందుకోసం నానిని పావుగా వాడుకుంటుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి.
బెజవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ తారస్థాయికి చేరుకుంది. తన రాజకీయ అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేశారని చిన్నిపై నాని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించినప్పటికీ చిన్నిపై నాని పొలిటికల్ వార్ కంటిన్యూ చేస్తున్నారు.తరుచుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఉర్సా కంపెనీ చిన్ని బినామీదే అంటూ ఆరోపించిన నాని తాజాగా లిక్కర్ స్కామ్ లో చిన్ని ప్రమేయం ఉందంటూ ఆరోపించారు.
దీనిపై చిన్ని స్పందిస్తూ…దమ్ముంటే తనకు కసిరెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు నిరూపించాలని, ఇష్టానురీతిగా నాని నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ శాంతించని నాని, నువ్వెన్ని పిట్ట కథలు చెప్పినా రాజ్ కసిరెడ్డితో కలిసి విదేశాలకు డబ్బు మళ్లించింది వాస్తవం అంటూ రాసుకొచ్చారు.
నిజంగానే.. రాజ్ కసిరెడ్డితో చిన్నికి లిక్కర్ స్కామ్ తో ప్రమేయం ఉంటే, సిట్ విచారణలో ఎందుకు చిన్న క్లూ కూడా బయటకు రాలేదు?, రాజ్ కసిరెడ్డి అయినా టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదు అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, కేశినేని నాని ఆరోపణల వెనక వైసీపీ హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగవంతం అవుతోన్న నేపథ్యంలో దాన్ని మూలాలు తాడేపల్లి ప్యాలెస్ తో లింక్ అయినట్లు ఉన్నాయని , దాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ స్కెచ్ వేసినట్లుగా రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.