చిరు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వాయిదా.. కార‌ణ‌మిదే!

చిరు ఫ్యాన్స్‌కి మ‌రో షాక్‌! ఈనెల 4న జ‌ర‌గాల్సిన ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వాయిదా ప‌డింది. ఈనెల 7న ఈ వేడుక‌ని నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అయితే వేదిక ఇంకా ఫిక్స్ కాలేదు. చిరంజీవి – వినాయ‌క్‌ల కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొన్న చిత్రం ఖైదీ నెం. 150. ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌ని క్రిస్మ‌స్ సంద‌ర్భంగా నిర్వ‌హించాల‌ని చిత్ర‌బృందం భావించింది. అయితే ఆ నిర్ణ‌యం మార్చుకొన్నారు. ఏకంగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌నే గ్రాండ్‌గా చేయాల‌ని డిసైడ్ అయ్యారు. 4వ తారీఖున విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించ‌డానికి కూడా అనుమతులు తీసుకొన్నారు. ఇప్పుడు అక్క‌డే క‌థ అడ్డం తిరిగింది. `ఈ స్టేడియంలో ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌, సినిమా ఫంక్ష‌న్స్ చేసుకోవ‌డానికి అనుమ‌తులు లేవు` అంటూ విజ‌య‌వాడ మున్సిప‌ల్ అధికారులు మోకాల‌డ్డార‌ట‌. అయితే ఇక్క‌డ ప‌ర్మిష‌న్ మంజూరు చేసింది కూడా వాళ్లే. ఇప్ప‌టికిప్పుడు ఎందుకు ప్లేట్ మార్చారు అనేది ఆస‌క్తిని క‌లిగిస్తోంది. దీని వెనుక రాజ‌కీయ హ‌స్తం ఏమైనా ఉందా? లేదంటే నిజంగానే అక్క‌డ అనుమ‌తులు దొర‌కవా? అనే చ‌ర్చ మొద‌లైంది.

ఈ విష‌యంపై ఖైదీ నెం.150 పీఆర్వో సురేష్ కొండేటి తెలుగు 360తో మాట్లాడారు. ”ఇది వ‌ర‌కు ఓ సినిమా ఫంక్ష‌న్ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించాల‌ని అనుకొన్నారు. అప్పుడు కోర్టులో పిటీష‌న్ వేసి స్టే ఆర్డ‌ర్ తెచ్చుకొన్నారు. ఆనాడే ఈ స్టేడియంలో సినిమా, ప్రైవేటు ఫంక్ష‌న్లు నిర్వ‌హించుకోకూడ‌ద‌ని కోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది. దాన్ని గ‌మ‌నించ‌కుండా ప్ర‌స్తుతం ఉన్న అధికారులు అనుమ‌తులు మంజూరు చేశారు. ఇప్పుడు పాత ఆర్డ‌ర్లు ఓసారి చెక్ చేసుకోవ‌డం మూలాన‌… ఖైదీ నెం.150కి ఇచ్చిన అనుమ‌తులు వెన‌క్కి తీసుకొన్నారు” అంటూ క్లారిటీ ఇచ్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close