టీడీపీకి కొత్త అధ్యక్షుడు..! జగన్ చుట్టూ అన్నా.. అన్న అని తిప్పుతారట కొడాలి నాని..!

వైసీపీ నేతలు.. టీడీపీపై పూర్తి స్థాయి ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. ఈ సారి వంతు మంత్రి కొడాలి నానిది. మామూలుగా ఆయన నోరు తెరిస్తే..మీడియా రాయలేని.. చూపలేని భాష బయటకు వస్తుంది. ఇంక ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడితే వినేవాడు తట్టుకోవడం కష్టమే. అది ఈ రోజు చూపించారు. ఈ ఫ్రస్ట్రేషన్‌లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసారు. అనుకోవాలేగానీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించి… అన్నా…అన్నా అనిపించుకుంటూ వెంట తిప్పుకోగలమని ప్రకటించేశారు. ఈ వ్యాఖ్య హైలెట్ అయ్యే సూచనలు కనిపిపిస్తున్నాయి. జగన్‌ తలుచుకుంటే టీడీపీ కార్యాలయం.. వైసీపీ స్టోర్‌ రూమ్‌కు షిఫ్ట్‌ అయిపోతుందని టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందని కొడాలి నాని హెచ్చరించారు.

సన్నాసి, వెధవ, లుచ్చాగాళ్లు చంద్రబాబు, దేవినేని ఉమ అని.. మొహమాటం లేకుండా తిట్టిపోశారు. సొంత నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోలేని సన్నాసి చంద్రబాబు అని.. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ పేరుతో బతికే నీవా మా గురించి మాట్లాడేది అని చెలరేగిపోయారు. పిచ్చి వాగుడు వాగితే ఒక్కొక్కరి తాట తీస్తామని హెచ్చరించారు. సన్న బియ్యం ఇవ్వకపోవడంపై.. చేసిన విమర్శలను..తనదైన ఘాటు లాంగ్వేజ్‌లోనే చెప్పుకొచ్చారు. సన్నబియ్యం ఇస్తామని నీ అమ్మ మొగుడికి చెప్పామా? అని ప్రశఅనించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సన్న బియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్‌ను కొడాలి నాని వదిలి పెట్టలేదు. కులాలు, మతాల గురించి … రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఎవరన్న ఉన్నారంటే పవన్ కల్యాణేననని ..రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు అడిగితే జగన్‌ సమాధానం చెప్పాలా? అని వెటకారం చేశారు. తిరుమల ఆలయంలో జగన్‌ సంతకం చేయాల్సిన అవసరం లేదన్నారు. సోనియా ఇటలీ నుంచి వచ్చింది.. జగన్‌ ఏపీ పౌరుడు.. తన కులం, మతం గురించి చెప్పాల్సిన అవసరం జగన్‌కు ఏంటి అని లాజిక్ తీశారు. జగన్‌ కుటుంబం గురించి పిచ్చిగా మాట్లాడితే… నీ కుటుంబ బండారం బయటపెడతానని హెచ్చరించారు. నీవు.. నీ పార్ట్‌నర్‌ కలిసి.. జగన్‌ చిటికిన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close